
Minister Roja cried : మంత్రి రోజా భోరున ఏడ్చారు. తన పాత గాయాలను మళ్లీ లేపారు. వైఎస్ఆర్ హయాం నుంచి ఇప్పటివరకూ తను అనుభవించిన నరకాన్ని పంచుకొని కన్నీరు కార్చారు. ఐరెన్ లెగ్ అన్న విమర్శలపై ఎట్టకేలకు ఓపెన్ అయ్యారు. రోజా కన్నీళ్లతో ఫేస్‌బుక్‌లో పంచుకున్న ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇంతకీ రోజా ఏమన్నారు? ఎందుకు ఏడ్చారన్న దానిపై స్పెషల్ ఫోకస్
సినిమాల్లో హిరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన రోజా తెలుగుదేశం పార్టీ చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మహిళలతో కలిసి ఎన్నో ఉద్యమాలు నడిపారు. ప్రత్యర్థులను పదునైన మాటలతో విమర్శల దాడి చేసేవారు. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. ఆ తరువాత ఆమె టీడీపీని వీడారు. వైసీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి చంద్రబాబు, లోకేశ్‌లను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. బబర్దస్త్ పంచులతో నోరు పారేసుకుంటున్నారు. ఐరన్ లెగ్ అని అందరూ అంటుండటంపై ఎప్పుడు స్పందంచని ఆమె ఇప్పుడు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
వైసీపీ నుంచి నగరి గెలిచిన అనంతరం రోజా నియోజకవర్గంలో అసలు ఉండేవారు కారట. ఎక్కువగా జబర్దస్త్, బతుకు జట్కా బండి షోలను చేసుకుంటూ, ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలను మరిచిపోయినట్లు పుకార్లు వచ్చాయి. దీనిపై సొంత పార్టీ నేతలే విమర్శలు గుప్పించారు. బహిరంగంగానే అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆమె వర్గపోరును ఎదుర్కొంటున్నారు. రాబోవు ఎన్నికల్లో ఆమెకు కాకుండా స్థానిక అభ్యర్థికి టిక్కెట్ ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నారు.
ఎన్నికల్లో ప్రజాకర్షణ ఉన్న నేతకు విజయం వరిస్తుంది. అందుకు భావోద్వేగాలు కూడా పనిచేస్తాయి. ప్రస్తుతం రోజా కూడా భావోద్వేగానికి గురయ్యారు. రాస్ సంస్థ ఆధ్వర్యంలో పుత్తూరులో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన అఫీషియల్ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. ఎంతో కష్టపడి, అవమానాలు ఎదుక్కొని ఈ స్థాయికి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టాలు పడినట్లు అన్నారు. రాజకీయాల్లో సభ్యురాలిగా గెలవలేనని, ఐరన్ లెగ్ అంటూ అవమానాలు గురిచేశారని బాధపడ్డారు.