KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రప్రభుత్వం తీసుకున్న ఎరువుల ధరల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం రైతు వ్యతిరేకమని నిరసన తెలిపారు. దేశ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదని విమర్శించారు. ఎరువుల ధరలు పెంచి అన్నదాత నడ్డీ విరుస్తున్నారని మండి పడ్డారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని చెప్పిన కేంద్రం, వ్యవసాయ ఖర్చులు పెంచడం దుర్మార్గమైన చర్య అని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

గత కొద్ది కాలం నుంచి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక వైఖరి అనుసరిస్తున్నారు. అంతకు మునుపు కేంద్రంలోని బీజేపీ తీసుకున్న కొన్ని నిర్ణయాలకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇటీవల కాలంలో మాత్రం కేంద్రంపై ఫైర్ అవుతున్నారు. పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని కేంద్రంపై టీఆర్ఎస్ సర్కారు విమర్శించింది. తాజాగా ఎరువుల ధరల పెంపు నేపథ్యంలో కేంద్రంపై తీవ్రస్థాయిలో కేసీఆర్ ఫైర్ అవుతున్నారు. కేంద్రం రైతులను వారి పొలాల్లోననే కూలీలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పచ్చి రైతు వ్యతిరేక ప్రభుత్వమని, కరెంటు మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేస్తున్నదని విమర్శించారు.
Also Read: షాకింగ్ : ప్రముఖ స్టార్ హీరో మృతి !
వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకుగాను ప్రయత్నిస్తున్న బీజేపీని కూకటి వేళ్లతో పెకలించి వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వెంటనే కేంద్రం పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ కుట్రలను రాష్ట్ర రైతాంగం అర్థం చేసుకోవాలని కోరారు. ఎరువుల ధరల పెంపుపై సీఎం కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి బహిరంగ లేఖ రాయనున్నారు.
ఇకపోతే ఇటీవల కాలంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌కు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే వామపక్ష పార్టీల నేతలు, కేరళ సీఎం పినరయి విజయన్, బిహార్ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వియాదవ్‌లతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫెడరల్ లేదా తృతీయ ఫ్రంట్ కు అడుగులు వేస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ వ్యతిరేక విధానం తీసుకుని కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలన్నిటినీ కలుపుకుని ముందుకు సాగే చాన్సెస్ ఉన్నాయి.
Also Read: శృంగార తారతో రవితేజ స్టెప్పులు.. ఏమిటి ఈ దౌర్భాగ్యం ?
[…] […]
[…] Ganta Srinivasa Rao: రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుది ప్రత్యేక శైలి. ఆయన ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నపార్టీకే ప్రాతినిధ్యం వహించారు. ఈ సారి మాత్రం తన అంచనాలు తప్పాయి. టీడీపీకి అధికారం వస్తుందని భావించినా అలా జరగలేదు. ఫలితంగా వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. దీంతో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తెరమీదకు తెస్తూ వారి కోసం రాజీనామా చేశారు. కానీ ఇంతవరకు ఆయన ఏ పార్టీలో కూడా చేరలేదు. దీంతో ఒక దశలో ఆయన వైసీపీలో చేరతారని, మరోవైపు జనసేన తీర్థం పుచ్చుకుంటారని, ఇంకోవైపు కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం సాగింది. […]