Suicide: ఆమె ఓ వైద్యురాలు. రోగుల ప్రాణాలు కాపాడే పవిత్రమైన వృత్తి. సజావుగా సాగుతున్న జీవితం. ఎలాంటి కలతలు లేని పరిస్థితి. కానీ ఆమెలో తెలియని భయం ఆవహించింది. నూరేళ్ల జీవితం మధ్యలోనే చాలించింది. పది మందికి ప్రాణాలు పోయాల్సిన పవిత్రమైన వృత్తిలో ఉంటూ తన ప్రాణాలే తీసుకుంది. ఓవర్ డోస్ ఇంజక్షన్ తనకు తానే ఇచ్చుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

గుజరాత్ రాష్ర్టంలోని సూరత్ పట్టణంలో మహువాకు చెందిన డాక్టర్ జిగిషా (26) ఓ ప్రముఖ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. గైనకాలజీ విభాగంలో విధులు నిర్వహిస్తోంది. ఆస్పత్రి క్వార్టర్స్ లో కె బ్లాక్ లో ఉంటోంది. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. ఆమెకు ఓ సోదరి కూడా ఉంది. ఆత్మహత్యకు ముందు కూడా తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
జిగిషా సీనియర్ల వేధింపులు తాళలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సీనియర్ల నుంచి వస్తున్న ముప్పును తప్పించుకునే క్రమంలోనే ఆమె తన ప్రాణాలు తీసుకుంది. అనస్టీషియా అనే ఇంజక్షన్ ను ఓవర్ డోసు వేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
Also Read: Kerala: 15 ఏళ్ల బాలుడు 21 ఏళ్ల యువతిపై లైంగి క దాడి? అసలు ట్విస్ట్ ఇదే
చదువుకున్న డాక్టరే ఇలా ఆత్మహత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. రోగులకు ధైర్యం చెప్పే ఆమె తన ప్రాణాలు తీసుకోవడంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అయితే సీనియర్ల వేధింపులు తాళలేక ఆమె ఓసారి ఇంటికి కూడా వెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తానికి డాక్టర్ మృతిపై ఆమె సోదరి కంటతడి పెట్టిన తీరు అందరిని కలచివేసింది.
Also Read: Kerala: యూ ట్యూబ్ లో చూస్తూ ప్రసవం.. కేరళలో బాలిక చర్య వివాదాస్పదం