https://oktelugu.com/

Farmers’ : ఆత్మహత్యలు లేని రాష్ట్రం.. కేసీఆర్‌ ఆడిన అబద్ధం!

Farmers’ : పాలకుడు మాట్లాడితే దానికి ఓ సాధికారత ఉండాలి, విలువ ఉండాలి, అదొక డాక్యుమెంట్‌లా ఉండాలి, మళ్లీ పదే పదే మారకుండా ఉండాలి, అన్నింటికీ మించి అది నిజమై ఉండాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అదే నచ్చని విషయం. ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, ‘కేసీఆర్‌ మాటియ్యడు.. ఇస్తే తల నరుక్కుంటాడు కాని తప్పడు’ అంటాడు.. కరోనా– పారాసిటమాల్‌ వైద్యంలాగా..! మామూలు జనానికి అర్థం కాకపోవచ్చుగాక, కానీ చదువుకున్నవాళ్లకు, ఆలోచించగలిగేవాళ్లకు ఆ మాటల్లోని డొల్లతనం ఇట్టే […]

Written By:
  • NARESH
  • , Updated On : January 29, 2023 / 05:42 PM IST
    Follow us on

    Farmers’ : పాలకుడు మాట్లాడితే దానికి ఓ సాధికారత ఉండాలి, విలువ ఉండాలి, అదొక డాక్యుమెంట్‌లా ఉండాలి, మళ్లీ పదే పదే మారకుండా ఉండాలి, అన్నింటికీ మించి అది నిజమై ఉండాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అదే నచ్చని విషయం. ఏదో ఒకటి మాట్లాడేస్తాడు, ‘కేసీఆర్‌ మాటియ్యడు.. ఇస్తే తల నరుక్కుంటాడు కాని తప్పడు’ అంటాడు.. కరోనా– పారాసిటమాల్‌ వైద్యంలాగా..! మామూలు జనానికి అర్థం కాకపోవచ్చుగాక, కానీ చదువుకున్నవాళ్లకు, ఆలోచించగలిగేవాళ్లకు ఆ మాటల్లోని డొల్లతనం ఇట్టే అర్థమవుతుంది. తెలంగాణలో రైతు ఆత్మహత్యల్లేవ్‌ అని మొన్న ఎక్కడో భారీ స్టేట్‌మెంట్‌ పాస్‌ చేశాడు.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నినాదం చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఆప్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదంతో హస్తిన గద్దెపై ఆశలతో జాతీయ రాజకీయాలు మొదలు పెట్టాడు. మరి కేసీఆర్‌ రైతు ఆత్మహత్యలపై చెప్పింది నిజమా..? నిజంగా తెలంగాణలో రైతులు రోజూ పండుగ చేసుకుంటున్నారా..? ఆత్మహత్యలే లేవా..? దీనిపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో దీటుగా, బలంగా కౌంటర్‌ చేసే నాయకుడే లేకుండా పోయాడు. కౌంటర్‌ చేసినా అది జనానికి రీచ్‌ కాదు. ఎందుకంటే, రాష్ట్రంలో ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా చతుర్విద ఉపాయాలతో కేసీయార్‌ అంటే భయం భక్తులతో వ్యవహరిస్తోంది. ఈమధ్య రైతుల సమస్యలపై బలంగా గళం ఎత్తుతున్న రైతు స్వరాజ్యవేదిక స్పందిస్తుందని అనుకుంటే, దాని నుంచి కూడా బలమైన కౌంటర్‌ రాలేదు. అప్పుడప్పుడూ కేసీఆర్‌ పాలన విధానాలపై నిష్కర్షగా తన ఒపినీయన్‌ వెల్లడిస్తుందని అనుకున్న ఆంధ్రజ్యోతికీ చేతకాలేదుం (ఫాఫం, దానికి రాసేవాళ్లు కరువైనట్టున్నారు) ఏదో దిశ అనే ఓ డిజిటల్‌ పత్రిక, పెద్దగా జనంలోకి రీచ్‌ లేని వెలుగు మాత్రం అందుకున్నాయి. కేసీయార్‌ అబద్ధాన్ని లెక్కలతో సహా ఎండగట్టాయి. ఇక గులాబీ రంగు పులుముకున్న ఈనాడు, సాక్షి వంటి పత్రికలకు చేతకాదు. కాస్తో కూస్తో చిన్న పత్రికలే ప్రొఫెషనల్‌ పోకడలతో సాగుతున్నట్టున్నాయి. అంతో ఇంతో ప్రతిపక్షాల వాయిస్‌ జనానికి వెళ్తుంది అంటే సోషల్‌ మీడియానే కారణం.

    ఓ జాతీయ విధానం అంటూ ఉంటే కదా..
    తెలంగాణను వదిలేసి.. అసలు రైతు మరణాలో కాదో కూడా నిర్ధారణ లేని కుటుంబాలకు తెలంగాణ ప్రజల డబ్బుతో పంజాబ్‌లో చెక్కులు ఇచ్చి రావడమే విమర్శల పాలైంది. బీజేపీని విధానాలపరంగా కౌంటర్‌ చేయలేక, ఓ స్పష్టమైన జాతీయ ఎజెండా లేక సాగుతున్న బీఆర్‌ఎస్‌ విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులతోపాటు రైతు సమస్యలు అంటూ, రైతు ప్రభుత్వం అంటూ ఏదేదో మాట్లాడుతోంది. ఈ స్థితిలో తెలంగాణ మోడల్, రైతుల ఆత్మహత్యల్లేవు అనే స్టేట్‌మెంట్‌ నిజానికి కొద్దిగానైనా చర్చనీయాంశం అయి ఉండాలి. ఎవరైనా మరణిస్తే రైతు బీమా కింద డబ్బులొస్తాయి.. పెట్టుబడికి రైతుబంధు కింద డబ్బులిస్తాడు. నిజానికి వ్యవసాయాన్ని తన ప్రాణాల్ని పణంగా పెడుతున్నవాడు కౌలు రైతు. ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో సగం మంది వాళ్లే. ఏ ప్రభుత్వ సాయం ఉండదు, ఏ ప్రభుత్వ పథకం ఉండదు. ప్రభుత్వ లెక్కల్లో అసలు కౌలు రైతు అనే పదమే ఉండదుం ‘‘పంటనష్టాలతో జరిగేవి మాత్రమే రైతు ఆత్మహత్యలుగా పరిగణించాల్సిన పనిలేదు, నమ్ముకున్న వ్యవసాయం కుటుంబ సమస్యలను తీర్చనప్పుడు జరిగేవి కూడా రైతు ఆత్మహత్యలవే’’ అన్నాడు వైఎస్సార్‌. అదే నిజం.

    విత్తనం నుంచి అమ్ముకునేదాకా..
    వ్యవసాయం అంటేనే రిస్క్‌. నకిలీ విత్తనాల దగ్గర నుంచి మొదలై పంట అమ్మకాల దాకా ప్రతీ దశలోనూ రైతును పీడించేవి తెగుళ్లు కాదు, స్వార్థపరులైన వ్యాపారులు, ప్రకృతి. రైతు సంక్షేమ విధానం అంటే బటన్లు నొక్కి రైతు ఖాతాల్లోకి వ్యవసాయం చేస్తున్నా, చేయకపోయినా డబ్బు పంపించడం కాదు. నిజంగా సాగు వృత్తిలో ఉన్న రైతును ఆదుకునే ఓ వాస్తవ సంక్షేమ విధాన. అదే లేనప్పుడు ఇక ఆత్మహత్యల్లేని రాష్ట్రం ఎలా సాధ్యమవుతుంది.. ఇలాంటి మాటలు చెప్పే కేసీఆర్‌ పాలనలో, మాటల్లో ఇంతకన్నా పాదర్శకత ఆశించలేం. పాలకుల ముందు చేయిచాచే మీడయా నుంచి కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయలేం.