రైతు రాజ్యామా? ఈ లెక్కలేంటి కేసీఆర్ సార్.?

తనది రైతు రాజ్యమని కేసీఆర్ గొప్పగా చెప్పుకొన్నాడు. మొన్నటి ప్రెస్ మీట్ లో ప్రశ్నించిన విలేకరులతో ‘తెలంగాణలో ఏ రైతైనా రోడ్డెక్కుతడా.. దేశంలోనే రైతులకు అన్ని సమకూర్చిన రాజ్యం తెలంగాణ’ అని ఘనంగా చాటాడు. అయితే కేసీఆర్ ఎంత ధీమాగా చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. పంటనష్టం, అప్పుల బాధతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఓ […]

Written By: NARESH, Updated On : June 13, 2020 6:54 pm
Follow us on


తనది రైతు రాజ్యమని కేసీఆర్ గొప్పగా చెప్పుకొన్నాడు. మొన్నటి ప్రెస్ మీట్ లో ప్రశ్నించిన విలేకరులతో ‘తెలంగాణలో ఏ రైతైనా రోడ్డెక్కుతడా.. దేశంలోనే రైతులకు అన్ని సమకూర్చిన రాజ్యం తెలంగాణ’ అని ఘనంగా చాటాడు. అయితే కేసీఆర్ ఎంత ధీమాగా చెబుతున్నా క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం అంత ఆశాజనకంగా లేదని తెలుస్తోంది.

పంటనష్టం, అప్పుల బాధతో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తీసుకువచ్చినా దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఓ కఠిన వాస్తవం బయటపడింది.

తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటిదాకా దాదాపు 85మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రైతు స్వరాజ్య వేదిక సంచలన నివేదికను వెల్లడించింది. పంట నష్టం, అప్పుల భారంతోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపింది.

బీ.కొండల్ రెడ్డి నిర్వహించిన ‘ఆర్ఎస్వీ’ నివేదికలో ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లో అత్యధిక రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపింది. అంతేకాదు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన నాటి నుంచి తెలంగాణలో దాదాపు ఈ ఆరేళ్లలో 4600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని సర్వే తెలిపింది. వారిలో పత్తి రైతులే ఎక్కువమంది ఉన్నారు.అయితే ఈ ఆర్ఎస్వీ నివేదికపై స్ట్రేట్ క్రైం బ్యూరో ఇంతవరకు ఎటువంటి నివేదిక విడుదల చేయలేదు. ఆర్ఎస్వీ నివేదికపై వారు స్పందించలేదు.

ఇలా తెలంగాణలో ప్రతి జిల్లాల్లోనూ ఆత్మహత్యలు జరిగినట్టు ఓ నివేదిక సంచలనం రేపుతోంది.కేసీఆర్ మాత్రం తెలంగాణను రైతు రాజ్యం అభివర్ణించి చాలా వసతులు పథకాలు పెట్టారు. మరి కేసీఆర్ మాటలకు.. ఈ లెక్కలకు పొంతన లేకపోవడమే అందరిలోనూ అనుమానాలకు కారణమవుతోంది.