Garikapati : గరికపాటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రవచనాలు చెప్పడంతో ఆయనకు ఆయనే మేటి. ఆయన ప్రవచనాలకు దేశ వ్యాప్తంగా ఫాలోవర్స్, ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన ప్రవచనాలు కొన్ని సార్లు వివాదాలకు కూడా దారి తీస్తున్నాయి. నిజ జీవిత సత్యాలపై ఆయన వేసే ఛలోక్తులు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంటాయి. నవ్విస్తూనే పంచులు విసురుతుంటారు. ఆ పంచుల్లోంచి ఫైనల్ గా నీతి వాక్యాలు తీయడం ఆయన నైజం. అలాంటి గరికపాటి చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం మరోసారి ఆయన నాలుగేళ్ల క్రితం నాటి వీడియోను కొందరు కావాలని వైరల్ చేస్తున్నారు. నేడు వాలంటైన్ డే సందర్బంగా గరికపాటి అప్పట్లో అన్న వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు.
గరికపాటి నరసింహారావు వాలంటైన్స్ డే వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘లవర్స్ డే అదో డే. తద్దినం లాగా అదో దినం. ఆరోజుతో ప్రేమకు తద్దినం. ఎవరో మహానుభావులు బాగా ఆలోచించి పెట్టారు. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14, పిల్లల దినోత్సవం నవంబర్ 14, సరిగ్గా 9 నెలలు గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇందిరా పార్క్ లో ప్రేమంచుకుంటే అప్పటికి పిల్లలు పుట్టడం ఖాయం’ అంటూ విమర్శిలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు కొందరిని నొప్పించగా కొందరు మాత్రం సమర్థిస్తున్నారు. నేటి రోజుల్లో ప్రేమకు అర్థాలు మారిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో కూడా గరికపాటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంలో‘పుష్ప’రాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముడు, హరిశ్చంద్రుడు తగ్గేదేలే అంటే అర్థం ఉంటుంది కానీ పుష్ప లాంటి స్మగ్లర్ తగ్గేదేలే అని అనడం వల్ల సమాజం చెడుపోతుందని గరికపాటి కామెంట్లు చేశారు. ఇడియట్, రౌడీ పేర్లతో సినిమాలను తెరకెక్కించడం వల్ల సమాజానికి ఏం మేసేజ్ ఇస్తున్నామని ప్రశ్నించారు. ఆయన మాటల కారణంగా వివాదం చెలరేగింది. అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవిపై గరికపాటి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఒకానొక సందర్భంలో చిరంజీవి గారూ దయచేసి ఆ ఫొటోస్ దిగడం ఆపేసి వెంటనే ఇక్కడికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.. అప్పుడే నేను మాట్లాడడం మొదలుపెడతాను అని అన్నారు ఆయన. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా వర్గానికి ఆగ్రహం తెప్పించింది. గరికపాటి వీడియోలు యూత్‌ను అట్రాక్ట్ చేస్తుంటాయి. ఆయన ప్రవచన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
