https://oktelugu.com/

కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలు?

దేశంలో నమోదైన కేసుల్లో చనిపోతున్న వారి నిష్పత్తి సుమారు 2.8 శాతంగా ఉంది. కానీ ఈ సంఖ్య వివాదాస్పదం. అసలు ఈ మహమ్మారికి సంబంధించి ఇంకా చాలా సంఖ్యలు కూడా వివాదాస్పదమే. మొత్తం కేసుల సంఖ్యతో మొత్తం మరణాల సంఖ్యను భాగించటంలో.. నమోదు కాని కేసుల సంఖ్యను కానీ, అనారోగ్యం నుంచి మరణానికి మధ్య ఉన్న జాప్యాన్ని కానీ లెక్కలోకి తీసుకోవటం లేదని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో మేథమెటీషియన్ ఆడమ్ కుచార్స్కీ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 11, 2020 / 08:35 PM IST
    Follow us on

    దేశంలో నమోదైన కేసుల్లో చనిపోతున్న వారి నిష్పత్తి సుమారు 2.8 శాతంగా ఉంది. కానీ ఈ సంఖ్య వివాదాస్పదం. అసలు ఈ మహమ్మారికి సంబంధించి ఇంకా చాలా సంఖ్యలు కూడా వివాదాస్పదమే.

    మొత్తం కేసుల సంఖ్యతో మొత్తం మరణాల సంఖ్యను భాగించటంలో.. నమోదు కాని కేసుల సంఖ్యను కానీ, అనారోగ్యం నుంచి మరణానికి మధ్య ఉన్న జాప్యాన్ని కానీ లెక్కలోకి తీసుకోవటం లేదని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌లో మేథమెటీషియన్ ఆడమ్ కుచార్స్కీ పేర్కొన్నారు. మహమ్మారి విస్తరిస్తున్న ఈ దశలో కేస్ ఫాటాలిటీ రేట్ (సీఎఫ్ఆర్) సగటును చూసినపుడు.. ప్రభుత్వాలకు వాస్తవ పరిస్థితి కనిపించదని, దానివల్ల ఉదాశీనంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

    ‘‘సీఎఫ్ఆర్ అనేది ఒక కనికట్టు లాంటిది. నమోదైన కేసులు, మరణాల సంఖ్యను నమ్మినా కూడా.. మరణాల సంఖ్యను – ఫలితం తేలిన ముగిసిన కేసుల సంఖ్యతో భాగిస్తే ఇంకా ఎక్కువ సంఖ్య వస్తుంది’’ అని డాక్టర్ ముఖర్జీ చెప్పారు. తలసరి మరణాల రేటు కూడా వ్యాధి వ్యాప్తిని అర్థంచేసుకోవటాన్ని పరిమితం చేస్తుంది. ఎందుకంటే.. దేశంలో ఇంకా వైరస్ సోకని ప్రాంతాలు చాలా విస్తారంగా ఉన్నాయి.

    దేశంలో కరోనా మరణాల్లో యువత సంఖ్య ప్రపంచ సగటు కన్నా ఎక్కువగా ఉన్నట్లు ఆర్థికవేత్త పార్థా ముఖోపాధ్యాయ చేపట్టిన ఓ కొత్త అధ్యయనం చెప్తోంది. ‘‘ఇక్కడ ఎందుకింత ఎక్కువ మంది యువత చనిపోతున్నారో మనం కనిపెట్టాల్సిన అవసరముంది. డయాబెటిస్ వంటి జీవనశైలి వ్యాదుల వల్లనా లేక మన నగరాల్లోని కాలుష్య వాయువుల వల్ల వచ్చే శ్వాస సమస్యల వల్లనా? ప్రపంచంతో పోలిస్తే మన యువత అనారోగ్యంగా ఉందా?’’ అంటారు ప్రొఫెసర్ ముఖోపాధ్యాయ్.

    అయినప్పటికీ.. దేశంలో మరణాల సగటు రేటు చాలా తక్కువగానే ఉంటుందని, మరణాల్లో ఎక్కువ మంది వృద్ధులే ఉంటారని నిపుణులు చెప్తున్నారు. ‘‘దేశంలో కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. కానీ జబ్బుపడిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అంటే.. మనం ప్రమాదం నుంచి బయటపడి ఉండొచ్చు’’ అని ముఖోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.