Fake Liquor : మద్యం సేవించడానికి ఇష్టపడే వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. చాలా మంది మద్యం ప్రియులు వివిధ బ్రాండ్ల మద్యం తాగడానికి ఇష్టపడతారు. కానీ మార్కెట్లో అనేక రకాల నకిలీ మద్యం కూడా అందుబాటులో ఉందన్న వార్తలు చాలాసార్లు వినే ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. అసలు మద్యం నకిలీదో.. ఒరిజినల్ దని ఎలా కనుగొంటారు. దానిని రుచి చూడటం ద్వారా ఆ మద్యం నిజమైనదా లేదా నకిలీదా అని కనుగొనవచ్చా.. ఈ రోజు దాని గురించి తెలుసుకుందాం.
మద్యం ప్రియులు వారికి సందర్భంతో పనిలేదు.. ప్రతి సందర్భంలోనూ మద్యం తాగుతారు. ఇది మాత్రమే కాదు, వారు వివిధ బ్రాండ్లు, ఇతర దేశాల నుండి మద్యం ఆర్డర్ చేసి తాగుతారు. కానీ ప్రశ్న ఏమిటంటే.. మద్యం తాగే వ్యక్తి తాగిన తర్వాత నకిలీ మద్యం, నిజమైన మద్యం మధ్య తేడాను గుర్తించగలరా? ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది మార్కెట్లో నకిలీ మద్యం కూడా అమ్ముతున్నారు కూడా.
నకిలీ మద్యం గుర్తించడం
నేడు నకిలీ మద్యం తయారు చేసే కంపెనీలు మరింత హైటెక్‌గా మారాయి. దీనివల్ల నకిలీ మద్యాన్ని గుర్తించడం కష్టం. నకిలీ మద్యం తయారు చేసే కంపెనీలు దాని రంగు, రుచి, వాసనను నిజమైన మద్యం లాగానే తయారు చేస్తున్నాయి. అందువల్ల, కొన్నిసార్లు నకిలీ మద్యాన్ని గుర్తించడం కష్టంగా ఉంటుంది. కొంతమంది నకిలీ మద్యం తాగిన తర్వాత దానిని గుర్తించగలిగినప్పటికీ, అందరూ గుర్తించలేరు. కానీ అధికారిక దుకాణం నుండి మద్యం కొనుగోలు చేస్తే నకిలీ మద్యం లభించే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
పెరిగిన మద్యం వినియోగం
అమెరికాలో ఆల్కహాల్ వాడకం పెరిగిందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. అదే సమయంలో 2016-2017, 2020-2021 మధ్య, అతిగా మద్యం సేవించడం వల్ల మరణాలు దాదాపు 30 శాతం పెరిగాయి.
నకిలీ మద్యం తాగితే ఏమవుతుంది?
అనుకోకుండా నకిలీ మద్యం సేవించినా శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. రాత్రిపూట వాంతులు వచ్చి కొన్నిసార్లు పరిస్థితి మరింత దిగజారి ఒక వ్యక్తి చనిపోవచ్చు కూడా. విషపూరిత మద్యం తాగడం వల్ల గందరగోళం, వాంతులు, మూర్ఛలు, బలహీనత, అసమతుల్య శ్వాస, చర్మంపై నీలం రంగు, అల్పోష్ణస్థితి, అపస్మారక స్థితి వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించడం ద్వారా దీనిని నివారించవచ్చు.
ఆల్కహాల్ లో ఉండే ఈ రసాయనం ప్రమాదకరమా?
ఆల్కహాల్ తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాన్ని ఇథనాల్ అంటారు. మద్యం తయారీ కంపెనీలు ఈ రసాయనాన్ని నిర్ణీత పరిమాణంలో ఉపయోగిస్తాయి. ఇథనాల్ కు బదులుగా, స్పిరిట్, మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, యూరియా, ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వంటి అనేక రసాయనాలను నకిలీ మద్యం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రసాయనాల పరిమాణం పెరగడం వల్ల ఆల్కహాల్ విషపూరితంగా మారుతుంది.