Exhibitors: ప్రభుత్వంతో ‘ఫైట్’కు సిద్ధమవుతున్న సినీ ఎగ్జిబిటర్లు..!

Exhibitors: టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యం ఏపీకి ఇవ్వడం లేదనే భావనలో జగన్ సర్కారుకు ఉన్నట్లు కన్పిస్తోంది. ఈక్రమంలోనే చిత్ర పరిశ్రమను దారికి తెచ్చుకునేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అయితే సానుకూల వాతావరణంలో కాకుండా జగన్ సర్కార్ ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ తో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ వర్సెస్ ఏపీ సర్కార్ అన్నట్లు పరిస్థితి మారిపోయి ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది. కరోనాకు ముందు సినీ పరిశ్రమ మూడు పువ్వులు, […]

Written By: NARESH, Updated On : December 22, 2021 6:19 pm
Follow us on

Exhibitors: టాలీవుడ్ ఇండస్ట్రీ తెలంగాణకు ఇచ్చిన ప్రాధాన్యం ఏపీకి ఇవ్వడం లేదనే భావనలో జగన్ సర్కారుకు ఉన్నట్లు కన్పిస్తోంది. ఈక్రమంలోనే చిత్ర పరిశ్రమను దారికి తెచ్చుకునేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. అయితే సానుకూల వాతావరణంలో కాకుండా జగన్ సర్కార్ ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ తో లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్ వర్సెస్ ఏపీ సర్కార్ అన్నట్లు పరిస్థితి మారిపోయి ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతోంది.

YS Jagan

కరోనాకు ముందు సినీ పరిశ్రమ మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నచందంగా ఉండేది. కానీ కరోనా తర్వాత సీన్ రివర్స్ అయింది. థియేటర్లు మూతపడటం, ఓటీటీ హవా కొనసాగుతుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మానేశారు. దీంతో ఒకప్పుడు వంద కోట్లు కలెక్షన్లు రాబట్టిన స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం 30 నుంచి 40కోట్లకే పరిమితం కావాల్సి వస్తోంది. అయితే కొద్దిరోజుల నుంచి పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుండంటే ప్రేక్షకులు సైతం సినిమాలను చూసేందుకు మునుపటిలా థియేటర్లకు వస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ములిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా ఏపీ సర్కారు సినిమా టికెట్ల రేట్లను తగ్గించింది. బెనిఫిట్ షోలను పూర్తిగా ఎత్తివేసి పలు ఆంక్షలను విధించింది. ప్రభుత్వం విధించిన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఆన్ లైన్ టికెట్ విధానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీ స్వాగతించింది. అయితే టికెట్ల తగ్గింపుపై మాత్రం పెద్ద సినిమాల నిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, పలువురు నిర్మాతలు ప్రభుత్వాన్ని పునరాలోచించాలని కోరారు. అయితే ప్రభుత్వం స్పందించక పోవడంతో ఈ అంశంపై ఎగ్జిబిటర్లు కోర్టును ఆశ్రయించారు. గతంలో మాదిరిగానే భారీ బడ్జెట్ సినిమాల విషయంలో టిక్కెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని కోరారు.

దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి కోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవోను సస్పెండ్ చేస్తూ ఎగ్జిబిటర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. అయితే ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లింది. ప్రస్తుతం అక్కడ విచారణ జరుగుతోంది. మరోవైపు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో టికెట్ల రేట్లు పెంచుకోవాలంటే జాయింట్ కలెక్టర్ల అనుమతి తీసుకోవాలనే నిబంధన ఉంది. మరోవైపు అధికారులు థియేటర్లలో అధిక ధరలకు టిక్కెట్లను విక్రయిస్తున్నారా? అంటూ సోదాలు చేస్తోంది.

Also Read: ఆ జీవోలు రహస్యమా.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపాటు..!

ప్రభుత్వ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లపై దాడులు చేస్తూ సీజ్ చేస్తుండటంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎగ్జిబిటర్లు రేపు విజయవాడలో సమావేశం కావాలని తీసుకోవడం ఆసక్తిని రేపుతోంది. మరోవైపు హైకోర్టులో విచారణ సైతం గురువారం బెంచ్ ముందుకు రానుంది. ఈ సంకాంత్రికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఆలోపే టికెట్ల ధరల సమస్యలను పరిష్కరించుకోవాలని ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులంతా భావిస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వారంతా రెడీ అవుతున్నాయి. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీ సర్కారుతో కయ్యానికి కాలుదవ్వుతుందా? లేదంటే సయోధ్య కుదుర్చుకుంటుందా? అనేది ఉత్కంఠగా మారింది. ఏదిఏమైనా రేపు కోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగా అటు ప్రభుత్వంగానీ ఇటూ ఎగ్జిబిటర్లు గానీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే  టాక్ విన్పిస్తోంది.

Also Read: ప్రత్యేక హోదాపై ‘ఏపీ’ ఆశలు వదులుకున్నట్లేనా?