CM KCR Bihar Tour: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో కూటమి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొద్ది రోజులుగా దీనికి సంబంధించి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర లలో పర్యటించి అక్కడి ముఖ్య నేతలను కలుసుకుని బీజేపీయేతర ప్రభుత్వం కోసం కలిసి పనిచేద్దామని మంతనాలు జరిపారు. దీనికి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, పినరయ్ విజయ్, ఉద్ధవ్ ఠాక్రే లు మద్దతు తెలపడంతో ఇక ఇతర రాష్ట్రాలను కూడా చేరదీయాలని చూస్తున్నారు. గతంలో ఢిల్లీలో పర్యటించి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. బీజేపీయేతర కూటమి కోసం మద్దతు కావాలని అడిగారు.

ప్రస్తుతం బిహార్ లో పర్యటించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ లను కలిసి చర్చలు జరిపారు. దీనికి తమ చేయూత కావాలని అడిగారు. దీనికి లాలూప్రసాద్ యాదవ్ కేంద్రంలో ప్రభుత్వం మారాల్సిన సమయం వచ్చిందని తన మనసులోని మాట వెల్లడించారు. మూడో కూటమి ఏర్పాటుతో ఎన్డీయే, యూపీయే లను ఇంటికి పంపాలని ఆశిస్తున్నారు. దీనికి గాను అన్ని పార్టీలు ఒక్కటి కావాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేస్తున్నారు. బిహార్ లో కేసీఆర్ వేషధారణ చూసి అంతా షాక్ అవుతున్నారు. నెత్తిమీద గులాబీ తలపాగా చుట్టుకుని కొత్తగా కనిపించడంతో అందరు ఆసక్తిగా చూస్తున్నారు.
Also Read: Chandrababu- NDA: చంద్రబాబు ఎన్డీయేలో చేరతాడా ? అసలు ప్లాన్ ఏంటి?
రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పలు పార్టీల మద్దతు కూడగట్టుకుని బీజేపీపై పోరాటం చేయాలని చూస్తున్నారు. పలు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ తో జతకట్టేందుకు సుముఖంగా ఉన్నా పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన నిర్ణయాన్ని ప్రకటించలేదు. బీజేపీతోనే దోస్తీకి ఆయన రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్ కు ఏ మేరకు నేతల అండ లభిస్తుందో తెలియడం లేదు.

మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా దేశంలో బీజేపీని నిలువరించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నా ఆయన కోరిక తీరుతుందా? దేశంలో బీజేపీకి ఎదురే లేదని సర్వేలు చెబుతుండటంతో బీజేపీ పంతం నెరవేరుతుందో తెలియడం లేదు. మొత్తానికి రాజకీయ చదరంగంలో నేతల అంతర్మథనం ఎలా ఉండబోతోందనేది అంతుచిక్కడం లేదు. కేసీఆర్ మాత్రం మూడో కూటమి యత్నాల్లో తలమునకలైనట్లు తెలుస్తోంది. కానీ కేసీఆర్ కు పరిస్థితులు అనుకూలిస్తాయా? ప్రతికూలంగా మారతాయా అనేది తేలాల్సి ఉంది. రాజకీయ పోరాటంలో కేసీఆర్ ముందడుగు వేస్తున్నా అది అంత సులభం కాదని చెబుతున్నారు. కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరినట్లు గా కేసీఆర్ వ్యవహారం ఉందని ఇప్పటికే విమర్శలు రావడం తెలిసిందే.
Also Read:Hyderabad Tunnel Road: హైదరాబాద్‌లో సొరంగ మార్గం.. అనుమతి ఇచ్చిన ప్రభుత్వం!
[…] […]