Manmohan Singh Passed Away: మన్మోహన్ సింగ్ యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. ఆయన స్వతహాగా రాజకీయ నేత కాదు. ఆయన చదువరి.. గొప్ప గొప్ప చదువులు చదివిన నిత్య విద్యార్థి. అలాంటి వ్యక్తికి రాజకీయాలు తెలియవు. చాణక్యత తెలియదు. ఎత్తులు, పైఎత్తులు వేయడం తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఆర్థిక రంగం.. దేశాన్ని ఆర్థికంగా మొదటి స్థానంలో ఎలా నిలపాలి.. పౌరులకు మెరుగైన జీవితాన్ని ఎలా ఇవ్వాలి? వారికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించాలి? ఇలాంటి విషయాల మీదనే మన్మోహన్ సింగ్ ఆలోచనలు సాగేవి. మన్మోహన్ సింగ్ 1932లో సెప్టెంబర్ 26న జన్మించారు. ఆయన తండ్రి పేరు గురు ముఖ్ సింగ్ కోహ్లీ, తల్లి పేరు అమృత్ కౌర్.. చిన్న వయసులోనే మన్మోహన్ సింగ్ తల్లిని కోల్పోయారు. దీంతో తన అమ్మమ్మ జామ్నాదేవి వద్ద పెరిగారు .. చిన్నప్పుడు ఆయనను అందరూ మోహనా.. మోహనా అని ముద్దుగా పిలుచుకునేవారు. మన్మోహన్ సింగ్ విద్యాభ్యాసం అంత సులువుగా సాగలేదు. ఆయన ఉన్న ఊరిలో పాఠశాల ఉండేది కాదు. తన స్నేహితుడితో కలిసి ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకునేవారు . మన్మోహన్ సింగ్ కు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన ఉర్దూ మాధ్యమంలోనే చదువుకున్నారు. చివరికి హిందీ ప్రసంగాలను కూడా ఉర్దూలోనే రాసుకునేవాళ్ళు. కొన్నిసార్లు పంజాబీలో తన ప్రసంగాలను రాసుకోవడానికి గురుముఖి అనే పిన్ని వాడేవాళ్లు . సమయంలో దేశ విభజన చోటు చేసుకోవడం.. మన్మోహన్ సింగ్ కుటుంబం కొత్తరకం ప్రాంతంలోని హల్ద్వానీ అనే నగరానికి రావడం జరిగిపోయాయి . 1948లో అమృత్ సర్ ప్రాంతానికి వెళ్లి మన్మోహన్ సింగ్ కుటుంబం స్థిరపడింది.
ఉన్నత చదువులు చదివారు
పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో 1952లో డిగ్రీ చేశారు మనోహన్.. 1954లో పీజీ పూర్తి చేశారు. 1957లో కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ కోర్సును పూర్తి చేశారు. అయితే ఇన్ని చదువులు కూడా ఆయన కేవలం స్కాలర్షిప్ ఆధారంగానే సాగాయి.
డాక్టరేట్ చేశారు
డాక్టరేట్ చేసిన తొలి భారతీయ ప్రధానిగా మనోహన్ సింగ్ చరిత్ర పుటల్లో నిలిచారు. మనిషి జీవితాన్ని ప్రభావితం చేయగలిగేలాగా రాజకీయాలు ఎలా ఉంటాయని విషయంపై పరిశోధన చేసి.. ఆ పరిశోధనాత్మక గ్రంథం ద్వారా మన్మోహన్ సింగ్ డాక్టరేట్ పొందారు. అయితే మన్మోహన్ సింగ్ ఆర్థికవేత్తగా పేరు పొందుతున్న సమయంలోనే.. ఆయన గురించి తెలుసుకున్న నెహ్రూ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అయితే తాను రాజకీయాల్లోకి రానని.. పాఠాలు చెప్పుకుంటానని సున్నితంగా తిరస్కరించారు మన్మోహన్. ఆ తర్వాత కొంతకాలానికి మన్మోహన్ సింగ్ రాజకీయాల్లోకి రాలేక తప్పదు. ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా పనిచేసే తనకంటూ ఒక చరిత్రను సృష్టించుకున్నారు మన్మోహన్ సింగ్.