సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలో తనతో ఎవరు పెట్టుకున్నా ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో మంచి గుర్తింపు ఉందని చెప్పారు. దాన్ని ఎవరు పాడు చేయాలని చూసినా వారికే నష్టం కలుగుతుందని చెప్పారు. పరోక్షంగా ఈటలను టార్గెట్ చేస్తూ ఆయన ప్రసంగాలు ఉన్నాయి. అందుకే నిందలు పోగొట్టుకునేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందిస్తూ మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు స్నేహపూర్వకంగా ఉన్న సీఎం జగన్ పై జలవివాదాల్లో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏడేళ్ల కాలంలో ప్రతిపక్ష నేతలకు ఎప్పుడు దొరకని అపాయింట్ మెంట్ 15 నిమిషాల్లోనే ఇవ్వడంలో ఆంతర్యమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు.
సీఎం కేసీఆర్ ఏ పని చేసినా దానికో అర్థం ఉంటుందని తెలుస్తోంది. ఈటల రాజేందర్ ను సైతం అదే పద్ధతిలో పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రచారం జోరందుకుంది. ప్రగతిభవన్ లోకి మంత్రులనే రానివ్వరని విమర్శలున్నాయి. అది బానిస భవన్ అంటూ పలు సందర్భాల్లో ఈటల మాట్లాడిన తీరు తెలిసిందే. దీనికి సమాధానంగానే కేసీఆర్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.