https://oktelugu.com/

CM KCR: కేసీఆర్‌ అఫిడవిట్ లో తప్పులు.. బయటపెట్టిన ఆర్‌ఎస్పీ, రేవంత్‌!

తాజాగా ఈనెల 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన కేసీఆర్‌.. ఈసారి కూడా తన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 17, 2023 / 03:58 PM IST

    CM KCR

    Follow us on

    CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలనే కాకుండా ఎలక్షన్ కమిషన్‌ను కూడా మోసం చేశాడా.. నామినేషన్‌తోపాటు సమర్పించిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు పేర్కొన్నాడా.. అంటే అవతుననే అంటున్నారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అంటున్నారు. 2018 ఎన్నికల్లో గజ్వేల్ నుండి పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, తన అఫిడవిట్ లో స్థిరాస్తుల వివరాలు వెల్లడించలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సామాన్యులు నామినేషన్ పత్రాలలో ఏదైనా చిన్న తప్పు ఉంటే.. రిజెక్ట్ చేసే అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థిరాస్తుల వివరాలు తెలుపకున్నా ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. కేసీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలన్నారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

    తాజా అఫిడవిట్‌లోనూ..
    ఇక తాజాగా ఈనెల 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన కేసీఆర్‌.. ఈసారి కూడా తన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు సమర్పించారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఏబీఎన్‌లో గురువారం నిర్వహించిన బిగ్‌ డిబేట్‌లో పాల్గొన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ తన అఫిడవిట్‌లో భూముల వివరాలు తప్పుగా పేర్కొన్నారని వెల్లడించారు. భూపరిమితి చట్టాన్ని కూడ అతిక్రమించారని ఆరోపించారు. మొత్త భూముల వివరాలు లెక్క చేస్తే 70 ఎకరాలకుపైగా వస్తుందని, కానీ అఫిడవిట్‌లో 53.30 ఎకరాల మాత్రమే ఉన్నట్లు భూపరిమితిలోపు రాశారని తెలిపారు. భూపరిమితి చట్టం నిబంధన ప్రకారం.. తరి భూమి 25 ఎకరాలు, మెట్ట భూమి 54 ఎకరాలు ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్‌ భూమి తరి భూమే అని కానీ, తనది మెట‍్టభూమిగా పేర్కొని 53.30 ఎకరాలు ఉన్నట్లు వెల్లడించారని తెలిపారు. ధరణి కారణంగా తమ కుటుంబ సభ్యుల వివరాలు అందరూ చూసే అవకాశం లేకుండా బ్లాక్‌ చేశారని ఆరోపించారు.

    కేసీఆర్ భూముల లెక్క ఎంత?
    సీఎం కేసీఆర్.. తన అఫిడవిట్లో.. 53.30 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. కానీ ధరణి రికార్డుల్లో 53.31 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తోంది. ఒక గుంట భూమి ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తోంది. ఈ విషయాన్ని సీఎం కేసీఆరే స్వయంగా అఫిడవిట్‌లో తెలిపారు. తమ పాస్ బుక్స్, 1బీ రికార్డులో గుంట భూమి అధికంగా చూపిస్తోందని వివరించారు.

    భూములు ఎక్కడున్నాయి?
    సిద్దిపేట జిల్లా, మర్కూక్ మండలం, ఎర్రవల్లిలో సీఎం కేసీఆర్ పేరు మీద 36.1450 ఎకరాల భూమి ఉంది. అలాగే మర్కూక్ మండలం, వెంకటాపూర్‌లో 10 ఎకరాల భూమి ఉండగా.. భార్య శోభ పేరు మీద 7.1650 ఎకరాల భూమి ఉంది. మొత్తం కలిపితే 53.31 ఎకరాలు అవుతోంది. కానీ పట్టాల ప్రకారం ఉండాల్సింది 53.30 ఎకరాలు మాత్రమే అని తెలిపారు.