కలకలం: టీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఈడీ దాడులు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ స్నేహంగా ఉంటున్నారు. కానీ ఈ మధ్య కేటీఆర్ కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంంగాణలో పెద్దఎత్తున టీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు జరపడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని పదికి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ భారీగా నగదు, రూ.కోటికిపైగా […]

Written By: NARESH, Updated On : April 11, 2021 9:03 am
Follow us on

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కేంద్రంలోని బీజేపీ సర్కార్ నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు కేంద్రంలోని బీజేపీతో కేసీఆర్ స్నేహంగా ఉంటున్నారు. కానీ ఈ మధ్య కేటీఆర్ కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంంగాణలో పెద్దఎత్తున టీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు జరపడం కలకలం రేపింది.

హైదరాబాద్ లోని పదికి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ భారీగా నగదు, రూ.కోటికిపైగా విలువైన ఆభరణాలు, బ్లాంక్ చెక్కులు, ఆస్తులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకుంది. ఇందులో టీఆర్ఎస్ నేతలే ఎక్కువగా ఉన్నారని.. వారు టార్గెట్ గానే దాడులు జరుగుతున్నాయని ప్రచారం సాగుతోంది.

టీడీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, నాయిని మాజీ పీఎస్ ముకుందరెడ్డి, నిందితులు దేవికారాణి ఇళ్లలో సోదాలు జరిగాయి. ఈ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నిందితుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు నిర్వహించింది.

ఈ డొల్ల కంపెనీల వెనుక కొందరు నేతల ప్రమేయం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే ఈడీ విస్తృతంగా దర్యాప్తు చేస్తోంది. నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, ముకుందరెడ్డి బంధువు వినయ్ రెడ్డి ఇళ్లలో భారీగా నగదు, నలు లభించాయి. ఏడు డొల్ల కంపెనీల నిర్వాహకుడు బుర్ర ప్రమోద్ రెడ్డి ఇంట్లోనూ నగలు, నగదును ఈడీ స్వాధీనం చేసుకుంది. మరో ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.

అయితే సడెన్ గా ఈఎస్ఐ కుంభకోణం పేరిట తెలంగాణ టీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు జరగడం కలకలం రేపుతోంది. బీజేపీ తెలంగాణ పై ఫోకస్ చేసిందా? ఆ పార్టీ నేతలను టార్గెట్ చేసిందా? అన్న అనుమానాలు టీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి.