AP PRC 2022: ఏపీలో మొన్నటి దాకా పీఆర్సీ వివాదం ఎంతలా రగిలిందో అందరికీ తెలిసిందే. అయితే చర్చలతో సద్దుమణిగినట్టే అని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. ఉద్యోగ సంఘాల నాయకుల తీరుపై ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చర్చల్లో భాగంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించే ప్రయత్నం చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారనే వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి సమ్మెకు ఒకరోజు ముందు ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఇందులో భాగంగా కొత్త జీవోలు ఇచ్చిన తర్వాత అశుతోష్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికను అందరికీ తెలియజేస్తామని, బహిర్గతం చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో తెల్లారితే సమ్మెకు వెళ్లే ఉద్యోగులు కాస్తా వెనక్కు తగ్గారు. కానీ ఇప్పుడు చూస్తుంటే మాత్రం కొత్త చర్చల ప్రకారం కొత్త జీవోలు ఇచ్చారు.
Also Read: ఆ విషయంలో అలీకి అదృష్టం.. పోసానికి దక్కని ఫలితం.. ఎంత పనైపాయే..!
కానీ అశుతోష్ కమిటీ నివేదికను మాత్రం బయటకు రానివ్వట్లేదు. వాస్తవంగా చెప్పాలంటే ప్రతి ఐదేండ్లకు ఒకసారి నియమించే పే రివిజన్ కమిషన్ కు అశుతోష్ మిశ్రా గతంలో నేతృత్వం వహించారు. కాబట్టి ప్రస్తుతం కూడా ఆయన కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయాలి. కానీ ప్రభుత్వం దాన్ని పక్కన పక్కన పెట్టేసి సీఎస్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పీఆర్సీ ప్రకటించింది.

దీంతో అసలు అశుతోష్ నివేదికను తమకు ఎందుకు ఇవ్వరంటూ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా అటు ప్రభుత్వం గానీ.. ఇటు ఉద్యోగ సంఘాల నేతలు గానీ అస్సలు స్పందించడం లేదు. దీంతో వారిలో మరిన్ని అనుమానాలు పెరిగిపోతున్నాయి. అంటే ఆ నివేదికలో ఇంకేమైనా కీలక మైన అంశాలు ఉన్నాయా.. అందుకే జగన్ ప్రభుత్వం దాన్ని బయటకు రానివ్వకుండా ఉంచుతోందా అనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారంటూ కొందరు సోషల్మ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. అయినా సరే వారు మాత్రం స్పందించే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తానికి ఇదంతా చూస్తుంటే.. జగన్ అనుకున్నదే చేస్తున్నారు తప్ప ఉద్యోగులు అడిగింది మాత్రం ఇవ్వట్లేదని అర్థం అవుతోంది.
Also Read: మంత్రి గౌతంరెడ్డి ఫ్యామిలీ సంచలనం.. ప్రభుత్వానికి కోట్ల ఆస్తులు.. ఆయన పేరుతో యూనివర్సిటీ