https://oktelugu.com/

Employees: ఉద్యోగులు కదులుతున్నారు.. మళ్లీ ఊపు

Employees: ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసిన కరోనాతో వివిధ రంగాలు కుదేలయ్యాయి. వైరస్ ప్రభావం ఐటీశాఖ పైనే భారీగా పడింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఐటీ కంపెనీలో తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయాలని చెప్పారు. దీంతో ఏడాదిన్నరగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇటీవల కరోనా కేసులు తగ్గుతున్న దృష్ట్యా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. టీసీఎస్, హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు తిరిగి ఉద్యోగులను […]

Written By:
  • NARESH
  • , Updated On : October 25, 2021 / 10:11 AM IST
    Follow us on

    Employees: ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసిన కరోనాతో వివిధ రంగాలు కుదేలయ్యాయి. వైరస్ ప్రభావం ఐటీశాఖ పైనే భారీగా పడింది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఐటీ కంపెనీలో తమ ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయాలని చెప్పారు. దీంతో ఏడాదిన్నరగా ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇటీవల కరోనా కేసులు తగ్గుతున్న దృష్ట్యా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. టీసీఎస్, హెచ్ సీఎల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు తిరిగి ఉద్యోగులను తమ కంపెనీలకు రప్పిస్తున్నాయి. అయితే కంపెనీలకు వచ్చే ఉద్యోగులకు వ్యాక్సినేషన్, ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి చేస్తున్నాయి.

    IT Emplyees

    ప్రపంచ దేశాలతో పోటీపడుతున్న భారత్ కూడా ఐటీ రంగంలో దూసుకుపోతుంది. దేశంలో వివిధ ఐటీ కంపెనీలు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం ను ప్రకటించాయి. లాక్టౌన్ కారణంగా మూతపడిన కంపెనీలు ఆ తరువాత సడలింపులో భాగంగా పనిని మొదలు పెట్టినా పరిమితంగానే కొనసాగిస్తున్నాయి. అయితే ఐటీ కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉండడంతో పాటు ఏసీ వాతావరణంలో పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని భావించారు. దీంతో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం ను ప్రకటించారు. దీంతో చాలా మంది ఉద్యోగులు ఇంటినుంచే పనిచేస్తున్నారు.

    ఏడాదిన్నరగా ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఇంట్లో పనిచేయడం వల్ల కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డట్లు తెలిసింది. వర్క్ ఫ్రం హోం వల్ల తాము చాలా కష్టాలు ఎదుర్కొంటున్నామని కొందరు గృహిణులు పేర్కొన్నారు. ఇటీవల ఓ మహిళ తన భర్తను వెంటనే కార్యాలయానికి రప్పించాలని, తనకు సపర్యలు చేయడం నావల్ల కాదని తన గోడు వెల్లబోసుకుంది. ఇక ఉద్యోగులు సైతం ఇంట్లో వాతావరణంలో పనిచేయడం ఇబ్బందిగా మారిందని ఫీలవుతున్నారు.

    ఈనేపథ్యంలో కంపెనీలు సైతం తమ ఉద్యోగులు కళ్లెదుటే లేకపోవడం వల్ల చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో వర్క్ ఫ్రం హోంకు స్వస్తి చెప్పి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు ప్రణాళిక వేస్తున్నారు. అయితే ఉద్యోగులు కార్యాలయాలకు రావాలంటే కంపెనీలు కొన్ని నిబంధనలను పెడుతున్నాయి. ముఖ్యంగా కరోనా పరీక్ష చేయించుకున్న నెగెటివ్ ధృవ పత్రం తప్పనిసరి చేశారు. మరోవైపు వ్యాక్సినేషన్ పూర్తి కావాలని సూచిస్తున్నారు. అయితే వ్యాక్సిన్ వేసుకోని వారు ఇప్పటికైనా మొదటి డోసు వేసుకోవాలని కంపెనీలు సూచిస్తున్నాయి.

    భారత్లో పనిచేస్తున్న ఐటీ కంపెనీల్లో ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు వ్యాక్సిన్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. టీసీఎస్ ఉద్యోగుల్లో 70 శాతం మంది వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. 95 శాతం మంది మొదటి డోసు వేసుకున్ారు. అయితే వీరంతా స్పెషల్ డ్రైవ్ లో వ్యాక్సిన్ వేసుకున్నారు. రాను రాను కంపెనీలు వ్యాక్సినేషన్ తప్పని సరి చేయడంతో వీరంతా వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పడే వంద శాతం ఉద్యోగులును అనుమతించేది లేదని అంటున్నారు. మరికొన్ని రోజులు కరోనా కేసులు ఇలాగే ఉంటే ఈ ఏడాది చివరి వరకు వంద శాతం ఉద్యోగులను కంపెనీలకు రప్పిస్తామని కంపెనీ యజమానులు అంటున్నారు.

    ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు హైబ్రిడ్ వర్క్ మోడల్ వైపు చూస్తున్నామని అంటున్నారు. కరోనా మహ్మారి సమయంలో హైబ్రిడ్ వర్క్ మోడల్ పాపులర్ అయింది. అంటే కరోనా తీవ్రత కాస్త తగ్గిన నేపథ్యంలో వారానికి రెండు సార్లు కార్యాలయాలకు రప్పిస్తున్నారు. ఈ విధానం 18 నెలలుగా సాగుతోంది. ఇక హెచ్ సీఎల్ లాంటి కంపెనీల్లో కేవలం సీనియర్ ఉద్యోగులను మాత్రమే కార్యాయాలకు రప్పిస్తున్నారు.