Pentapati Pullarao: జనసేన పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. అధికారం కోసం అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థుల కోసం వెతుకుతోంది. ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించి వారిని నియోకవర్గాల్లో ప్రచారం నిర్వహించుకోవాలని సూచిస్తోంది. ఇందులో భాగంగానే ఏలూరు లోక్ సభ స్థానం నుంచి పెంటపాడు పుల్లారావును రంగంలోకి దింపాలని భావిస్తోంది. దీని కోసమే ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరులో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పుల్లారావు అభ్యర్థిత్వానికే పవన్ కల్యాణ్ మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. దీంతో ఆయనకే టికెట్ ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని విజయపథంలో నడిపించే నేతల కోసమే పవన్ ప్రయత్నిస్తున్నారు.

పుల్లారావు పోలవరం ఉద్యమకారుడు, ఆర్థిక వేత్తగా అందరికి సుపరిచితమే. దీంతో ఆయన సేవలు జనసేనకు అవసరమనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ఆయనను పార్టీలోకి తీసుకున్నారు. పుల్లారావు లాంటి వ్యక్తులు పార్టీకి కావాలనే ఆయనను పార్టీలో చేరాల్సిందిగా ఒప్పించారు. పార్టీలో చేరగానే ఆయనను పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించి పార్టీ కార్యక్రమాల్లో ఆయన సేవలను వినియోగించుకునేందుకు సిద్ధమయ్యారు. పార్టీ మార్గదర్శకత్వం కోసం ఆయన సలహాలు, సూచనలు తీసుకోవాలని భావిస్తున్నారు.
జనసేన రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తోంది. దీనికి గాను పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థులను ముందే ప్రకటించి వారితో ప్రచారం చేసి పార్టీ విజయం కోసం పాటుపడేలా చేయాలని ఉద్దేశిస్తోంది. పవన్ కల్యాణ్ నాయకుల వేటలో ఉన్నారు. సరైన నేతలను గుర్తించి నాయకత్వ బాధ్యతలను అప్పగించేందుకు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సమర్థులైన నేతలను నియమించి తద్వారా ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు.

వైసీపీ, టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అభ్యర్థులను ముందుగా ప్రకటించి వారిని నియోజకవర్గాల్లో పలుమార్లు పర్యటనలు చేసేలా ప్రేరేపించాలని చూస్తున్నారు. అధినేత పవన్ కల్యాణ్ నేతలను పార్టీ కోసం పనిచేసేలా కార్యోణ్ముఖులను చేస్తున్నారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా చూడాలని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ విజయపథంలో దూసుకెళ్లేందుకు కావాల్సిన అస్త్ర శస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. నేతల్లో సమన్వయం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని శ్రమిస్తున్నారు.