Elon Musk Ex-Girl Friend: చిన్ననాటి చిన్నప్పటి గుర్తులంటే అందరికీ ఎంతో ఇష్టం.. ఎన్ని కష్టాలు వచ్చినా ఆనాటి స్మృతులను పదిలంగా ఉంచుకుంటాం. అదే మనం ప్రేమించిన వ్యక్తి ఇచ్చిన బహుమతులు అయితే ఎంతో అపురూపంగా చూసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా..వాటిని చెక్కు చెదరకుండా.. మన ప్రాణంలా కాపాడుకుంటాం.. కానీ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలు తన మాజీ ప్రియుడు ఇచ్చిన బహుమతులు, గతంలో ఎలాన్ మస్క్ తో దిగిన ఫొటోలను వేలానికి పెట్టింది. కానీ ఎందుకు అలా చేసిందో తెలిస్తే మరింత షాక్ అవుతారు.

చదువుకునే టప్పుడు కలిసిన మనసులు..
ఎలాన్ మన్స్, జెన్నీఫర్‌లు 1994లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిలివేటియాలో చదువుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మనసులు కలిశాయి. అయితే చువు పూర్తయిన తర్వాత మస్క్ క్యాలిఫోర్నియాకు వెళ్లిపోయారు. దీంతో ఇద్దరూ విడిపోయారు. గతంలో మస్క్ చదువుకున్న రోజుల్లో పరీక్షలు రాసిన ఆన్సర్ పేపర్లు వేలం వేశారు. ఈ విషయం తెలుసుకున్న జెన్నీఫర్ తన మాజీ ప్రియుడితో దిగిన ఫొటోలు, ఆయన ఇచ్చిన కానుకలు, ఇతర జ్ఞాపకాలు వేలం వేయానిర్ణయించుకుంది.
ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు..
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఈయన ఇటీల తీసుకుంటున్న నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ట్విట్టర్‌ను కూడా కొనుగోలు చేడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వార్తతో ఆయన మరింత ఆసక్తి పెంచారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. అసలు ఎవరీ ఎలాన్ మస్క్ అని, ఆయన వ్యాపారాలు ఏమిటి, వ్యక్తిగత వివరాలు ఏమిటి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందిన ఎలాన్‌మస్క్ మాజీ ప్రియురాలు జెన్నిఫర్ గ్విన్. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఎలాన్ మస్క్ తో గతంలో దిగిన, మునుపెన్నడూ ఎవరూ చూడని ఫొటోలను జెన్నిఫర్ వేలానికి పెట్టింది. ఈ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిలియనీర్ ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలికి ఇన్ని కష్టాలా అంటూ నెటిజన్లు ఆమెపై సానుభూతి చూపిస్తున్నారు.

వేలంలో మాజీ ప్రియుడి జ్ఞాపకాలు
ఎలాన్ మస్క్, జెన్నిఫర్ గ్విన్ జంటగా దిగిన ఫొటోలతోపాటు.. పాత బహుమతులను వేలానికి ఉంచింది. చిత్రాలతోపాటు దాదాపు 20 ఐటమ్స్ ని వేలానికి పెట్టినట్లు తెలుస్తోంది. హూస్టన్‌లోని ఆర్‌ఆర్ ఆక్షన్ వెబ్‌సైట్‌లో లిస్ట్ అయిన ఈవస్తువుల వేలం సెప్టెంబర్ 14వ తేదీతో ముగిసింది. ఫొటోలతో పాటు తన మాజీ ప్రియుడు, బిలియనీర్ ఎలాన్ మస్క్ సంతకం చేసిన పుట్టిన రోజు కార్డును కూడా వేలానికి పెట్టింది జెన్నిఫర్. ‘హ్యాపీ బర్త్ డే బూబూ’ లవ్ ఎలోన్ అని రాసి ఉన్న కార్డును అమ్మకానికి పెట్టింది. ఎలాన్ మస్క్ 20 ఏళ్ల వయస్సులో అప్పటి తన ప్రియురాలు జెన్నిఫర్ గ్విన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, మస్క్ సంతకం చేసిన ఒక డాలర్ బిల్లు ఈవేలంలో ఉంచారు. పెట్టిన రోజు సందర్భంగా జెన్నిఫర్ గ్విన్‌కి ఇచ్చిన 14కే బంగారు నెక్లెస్‌ను కూడా వేలంలో పెట్టింది. ఎలాన్ మస్క్ రూంలో స్నేహితులతో కలిసినవి, పెన్సిల్వేనియా యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ సరదాగా గడిపిన పిక్స్ ఈవేలంలో ఉన్నాయి.
కోట్లు సంపాదించిన జెన్నీఫర్..
మస్క్, జెన్నీఫర్ జంటగా దిగిన ఫొటో 1.40 లక్షలకు అమ్ముడు పోయింది. గిఫ్ట్‌కార్డు రూ.14 లక్షలకు, గొలుసు రూ.40 లక్షలకు వేలంలో సేల్ అయ్యాయి. మొత్తం 18 ఫొటోలు వేలం వేయగా వీటిద్వారా రూ.1.33 కోట్లు వచ్చినట్లు తెలిపింది జెన్నీఫర్. ఈ మొత్తాన్ని తన తన సవతి కుమారుడు ట్యూషన్ ఫీజు కోసం డబ్బును సేకరించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆమె సౌత్ కరోలినాలో నివసిస్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈవేలంపై ఇంకా స్పందిచలేదు.