https://oktelugu.com/

ఎన్నికలు+అధికారం = జర్నలిస్టుల జీవితం

బెల్లం చుట్టూ ఈగలు.. అధికారం చుట్టేనే అందలం.. మొన్నటివరకు అధికారంలో ఉన్న పత్రికలు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షమైన పత్రిక ఇప్పుడు అధికారపక్షమైంది. అందుకే ఈ మార్పు ఆ రెండు సంస్థల జర్నలిస్టుల జీవితాల్లోనూ స్పష్టమైన మార్పును తీసుకువచ్చిందంటే అతిశయోక్తి కాదు.. *ఒక్క ఎన్నిక.. జర్నలిస్టుల జీవితాలు తలకిందులు ఎన్నికలు.. అధికారం.. ఇప్పుడు ఇవే జర్నలిస్టుల జీవితాలను రోడ్డున పడేయాలో.. కాపాడాలో నిర్ధేశిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.. అవును మొన్నటి సార్వత్రిక ఎన్నికల […]

Written By: , Updated On : April 26, 2020 / 10:24 PM IST
Follow us on


బెల్లం చుట్టూ ఈగలు.. అధికారం చుట్టేనే అందలం.. మొన్నటివరకు అధికారంలో ఉన్న పత్రికలు ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపక్షమైన పత్రిక ఇప్పుడు అధికారపక్షమైంది. అందుకే ఈ మార్పు ఆ రెండు సంస్థల జర్నలిస్టుల జీవితాల్లోనూ స్పష్టమైన మార్పును తీసుకువచ్చిందంటే అతిశయోక్తి కాదు..

*ఒక్క ఎన్నిక.. జర్నలిస్టుల జీవితాలు తలకిందులు
ఎన్నికలు.. అధికారం.. ఇప్పుడు ఇవే జర్నలిస్టుల జీవితాలను రోడ్డున పడేయాలో.. కాపాడాలో నిర్ధేశిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.. అవును మొన్నటి సార్వత్రిక ఎన్నికల ముందు వరకు ఆంధ్రాలో అధికారంలో ఉన్న పార్టీకి కాపుకాసిన పత్రికలే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ కుదేలయ్యాయి. జర్నలిస్టులను పక్కనపెట్టాయి. అధికార అండ లేకపోవడం.. కొత్త సర్కారు టైట్ చేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. ఇక దీనికి రివర్స్ గా అధికారంలోకి వచ్చిన అధికార మీడియా పరిస్థితి ఉంది.. అందులో జర్నలిస్టుల తీసివేతలు ప్రస్తుతానికి లేవు. జీతాల కోతలు లేవు. అంటే ఒక్క ఎన్నికలు జర్నలిస్టుల జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తాయన్నది ఇక్క సుస్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికలు+అధికారం ఉంటేనే జర్నలిస్టుల జీవితాలు బాగుంటాయి.. లేదంటే అథోగతి పాలవుతాయి. ఈ అక్షర సత్యం.. అక్షరాలు రాసే జర్నలిస్టులకు ఇప్పుడు అర్థమవుతోంది.

*ఆ రెండింటిలో కోత.. ఈ రెండూ సేఫ్
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి దగ్గరైన ఆ రెండు పత్రికలు మీడియాలో జర్నలిస్టుల కోతలు కొనసాగుతున్నాయి. అయితే అదే సమయంలో తెలంగాణ, ఏపీల్లో అధికారంలో ఉన్న మీడియాలో ఇప్పటివరకు జర్నలిస్టుల తొలగింపులు.. జీతాల కోతలు లేవు. సో అధికారమే వీరిని కాపాడిందన్న చర్చ సాగుతోంది.

*జర్నలిస్టుల బతుకుబండి నడిపేది అధికారమేనా?
ముందు నాలుగు అగ్రశ్రేణి మీడియా వర్గాలు కూడా ఒకే దారిలో లాక్ డౌన్ లో జర్నలిస్టులను పక్కనపెట్టాలని నిర్ణయించుకున్నాయట.. కానీ మొదట ప్రతిపక్ష పత్రికలు తొందరపడ్డాయి. దాని పర్యవసనాలు ఘోరంగా బయటకొచ్చాయి. దీంతో అధికార పత్రికలు సుదులాయించుకున్నాయి. వెంటనే అలాంటి నష్టనివారణ చర్యలు చేపట్టాయి. తీసేద్దామని లిస్ట్ రెడీ చేసుకొని మరీ ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని పక్కనపెట్టాయి. ఇలా అధికార పార్టీ మీడియాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు బతికిపోయారట.. దీన్ని బట్టి జర్నలిస్టుల బతుకు బండిని నడిపేది అధికారమనేది ఇట్టే అర్థమవుతోంది.

*వచ్చే ఐదేళ్లకు మళ్లీ ట్రెయిన్ రివర్స్
ఇప్పుడు అధికార పార్టీల్లో ఉన్న జర్నలిస్టులు పచ్చగా ఉన్నారు. మరో నాలుగేళ్లలో ఎన్నికల్లో తలకిందులైతే మళ్లీ ట్రెయిన్ రివర్స్. అప్పుడు అధికారంలోకి వచ్చిన మీడియాకు రాజకీయ అండ. ఇలా గాలిలో దీపంలా మారిపోయాయి జర్నలిస్టుల బతుకులు. అధికారం ఉన్నా లేకపోయినా అన్నేళ్ల సేవ చేసిన జర్నలిస్టులకు గుర్తింపు లేదా? సంస్థలు ఎందుకు పట్టించుకోవు అంటే మాత్రం దానికి సమాధానం దొరకడం చాలా కష్టం. అదో మిలియన్ డాలర్ల ప్రశ్న?

–నరేష్ ఎన్నం