Maharashtra CM : మహారాష్ట్రలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్.. సీఎంగా ఫడ్నవీస్ కాదు.. ఎవరంటే?

Maharashtra CM : పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ రాష్ట్రంలో శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసి సీఎంగా వైదొలగడం.. ఇక బీజేపీదే అధికారం అని అంతా అనుకున్నారు. బీజేపీ నేత ఫడ్నవీస్ సీఎం కావడం పక్కా అనుకున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు అదిరిపోయే ట్విస్ట్ నెలకొంది. మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండేనే […]

Written By: NARESH, Updated On : June 30, 2022 5:10 pm
Follow us on

Maharashtra CM : పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎవ్వరూ ఊహించని విధంగా ఆ రాష్ట్రంలో శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేసి సీఎంగా వైదొలగడం.. ఇక బీజేపీదే అధికారం అని అంతా అనుకున్నారు. బీజేపీ నేత ఫడ్నవీస్ సీఎం కావడం పక్కా అనుకున్నారు. ఈ మేరకు బీజేపీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పుడు అదిరిపోయే ట్విస్ట్ నెలకొంది.

మహారాష్ట్ర కొత్త సీఎంగా శివసేనను చీల్చిన ఏక్ నాథ్ షిండేనే కానున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవిలో షిండేనే కూర్చోనున్నారని.. ఆయనే కొత్త సీఎం అని సంచలన ప్రకటన చేశారు. మాజీ సీఎం ఫడ్నవీస్ ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది.

గోవా నుంచి నేరుగా ముంబైకి వచ్చిన షిండే ఈ మధ్యాహ్నం ఫడ్నవీస్ ఇంటికి వెళ్లి ఆయనను తీసుకొని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ తమ వద్ద ఉందని.. అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం విలేకరుల సమావేశంలోసీఎంగా తాను కాకుండా షిండే ఉంటారని.. ఆయనే ప్రమాణ స్వీకారం చేస్తారని ఫడ్నవీస్ సంచలన ప్రకటన చేశారు.

నిజానికి 106 ఎమ్మెల్యేల బలం ఉన్నా కూడా బీజేపీ సీఎం సీటును వదులుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 40 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న షిండేను సీఎం చేయడంలో మతలబు ఏంటని అందరూ ఆరాతీస్తున్నారు. శివసేనను చావుదెబ్బ తీసేందుకే సీఎం సీటును బీజేపీ త్యాగం చేసిందని అంటున్నారు. శివసేనలో తిరుగుబాటు చేసిన షిండే ఆ పార్టీని ఓన్ చేయించి.. బీజేపీలో విలీనం చేయించి.. ఉద్దవ్ నుంచి పార్టీని, గుర్తును లాగేసుకునే పనిలో భాగంగానే బీజేపీ ఈ స్కెచ్ గీసినట్టు తెలుస్తోంది.

మరో రెండేళ్లు మాత్రమే మహారాష్ట్ర సీఎం సీటుకు కాలపరిమితి ఉంది. ఈ తక్కువ సమయంలో ఫడ్నవీస్ సీఎంగా ఎక్కి ఏం చేయలేరని.. వ్యతిరేకత వస్తే షిండేపైనే వస్తుందని బీజేపీ భావించి ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి నేరుగా వెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఈ రెండేళ్లు ఒపిక పట్టాలని ఫడ్నవీస్ కు బీజేపీ అధిష్టానం సూచించినట్టు తెలుస్తోంది. అందుకే శివసేనను చీల్చి ఆ పార్టీని దెబ్బతీసిన షిండేకే సీఎం పగ్గాలు అప్పగించేందుకు ఫడ్నవీస్ కాంప్రమైజ్ అయినట్టు తెలుస్తోంది.