Telangana Formation Day 2022: తెలంగాణకు ఎనిమిదేళ్లు.. నాటికి నేటికి ఏం మారింది?

Telangana Formation Day 2022: దశాబ్ధాల కల.. తెలంగాణ ప్రజల పోరాటం.. సకల జనులు కలిసి చేసిన ఉద్యమ ప్రస్థానం.. వెరసి స్వరాష్ట్ర సాకారం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేటికి 8 ఏళ్లు గడిచాయి. మరి ఇన్నేళ్లలో తెలంగాణ ఆశలు ఆశయాలు నెరవేరాయా? నాటికి నేటికి తెలంగాణ ఏం మారింది? ఎలాంటి అభివృద్ధి సాధ్యమైంది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ.. సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ ఏర్పాటైంది. ఎంతో […]

Written By: NARESH, Updated On : June 2, 2022 6:34 pm
Follow us on

Telangana Formation Day 2022: దశాబ్ధాల కల.. తెలంగాణ ప్రజల పోరాటం.. సకల జనులు కలిసి చేసిన ఉద్యమ ప్రస్థానం.. వెరసి స్వరాష్ట్ర సాకారం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేటికి 8 ఏళ్లు గడిచాయి. మరి ఇన్నేళ్లలో తెలంగాణ ఆశలు ఆశయాలు నెరవేరాయా? నాటికి నేటికి తెలంగాణ ఏం మారింది? ఎలాంటి అభివృద్ధి సాధ్యమైంది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్పెషల్ స్టోరీ..

Telangana Formation Day 2022

సరిగ్గా 8 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ ఏర్పాటైంది. ఎంతో మంది అమరవీరుల త్యాగానికి ఫలితం దక్కింది. తెలంగాణ ప్రజల దశాబ్ధాల పోరాటానికి న్యాయం జరిగింది. ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, పార్టీలు అన్నీ కలిసి జేఏసీ గొడుగు కిందకు వచ్చి చేసిన ఈ పోరాటం అంతిమ లక్ష్యాన్ని చేరింది. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టారు. అధికారం కట్టబెట్టారు. మరి అప్పటికి ఇప్పటికీ ఏలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ మార్పులు ఏంటో చూద్దాం.

Also Read: ACB App in AP: ఏపీలో లంచాలకు చెక్.. జగన్ సంచలన నిర్ణయం..

-1969లో మొదలైన తెలంగాణ ఉద్యమం
తెలంగాణ ఉద్యమం ఇప్పటిది కాదు. 1969లోనే మహోద్యమం జరిగింది. ఉవ్వెత్తున ఎగిసిపడింది. స్వరాష్ట్రం కోసం ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేశారు. కానీ అప్పటి ప్రభుత్వాలు మాత్రం కాలయాపన చేస్తూ వచ్చాయి. హామీలకే పరిమితమయ్యాయి. ఉద్యమాన్ని నీరుగార్చాయి.

-2001లో టీఆర్ఎస్ మలిదశ ఉద్యమం
అయితే 2001లో తెలంగాణ సాధనే లక్ష్యంగా అప్పటివరకూ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్న కేసీఆర్ మరోసారి పదవి ఇవ్వనందుకు నిరసనగా పదవి వదులుకొని టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. మలి దశ ఉద్యమాన్ని ప్రారంభించారు.ఎంతో మంది నేతలు పదవులు వదలుకొని కేసీఆర్ వెంట నడిచారు. రాష్ట్రం కోసం కొట్లాడారు. వారికి ఉద్యోగాలు, విద్యార్థులపాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతుగా నిలిచారు.

kcr

-కేసీఆర్ ఆమరణ దీక్షనే మలుపుతిప్పింది.
తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసిన చరిత్ర నాటి ఉమ్మడి రాష్ట్ర సీఎం వైఎస్ఆర్ దే. నాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి లాగి కేసీఆరస్ ను ఏకాకిని చేసి అసలు తెలంగాణ మూవ్ మెంట్ లేకుండా చేశారు. కానీ 2009లో ఆయన మరణంతో కాంగ్రెస్ లో నాయకత్వ శూన్యత ఏర్పడింది. బలహీన రోశయ్య సీఎం అయ్యారు. ఇదే అదునుగా కేసీఆర్ 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఇదే ఉద్యమాన్ని మలుపుతిప్పింది. ఓయూ విద్యార్థి‘శ్రీకాంతచారి’ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఉస్మానియా యూనివర్సిటీ రగిలింది. తెలంగాణ అంటుకుంది. సకల జనులు రోడ్డెక్కి జై తెలంగాణ నినాదాలు చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడంతో ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి 2009 డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసింది.

-తెలంగాణను అడ్డుకున్న ఆంధ్రా నేతలు
నాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేయడంతో ఆంధ్ర నేతలు వ్యతిరేకించి అక్కడ ఉమ్మడి ఆంధ్ర కోసం ఆందోళనలు చేశారు. సమైక్యాంధ్ర నినాదంతో తెలంగాణకు అడ్డుపడ్డారు. 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసి ప్రజల మనోభావాలు, తెలంగాణ ఏర్పడాల వద్దా? అన్న దానిపై అభిప్రాయాలు తెలుసుకుంది. తెలంగాణకే ఈ కమిటీ జైకొట్టింది. ఈ క్రమంలోనే 2013 అక్టోబర్ 3న కేబినెట్ తెలంగాణకు ఆమోద ముద్ర వేసింది. 2014 ఫిబ్రవరి 18న లోక్ సభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభలో తెలంగాణ బిల్లు పెట్టగా బీజేపీ , ఇతర పార్టీలు మద్దతు తెలుపడంతో ఇది ఆమోదం పొందింది.

నెరవేరిన కల.. రాష్ట్ర ఆవిర్భావం
2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. అనంతరం 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ ఏర్పాడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యమ పార్టీనే ప్రజలు గెలిపించారు.టీఆర్ఎస్ కు అధికారం కట్టబెట్టారు. కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2018లో మరోసారి అభివృద్ధి చేసి కేసీఆర్ రెండో సారి ప్రజాభిమానం గెలుచుకొని సీఎం అయ్యారు.

-అభివృద్ధి, సంక్షేమం పంచిన కేసీఆర్
తెలంగాణ ఏర్పడ్డాక తొట్టతొలిగా చీకట్లో మగ్గిన తెలంగాణకు 24 గంటల కరెంట్ సాధించేలా కేసీఆర్ చేసిన కృషి ఫలించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు విద్యుత్ కోతలతో పగలంతా లేని విద్యుత్ తో ఉన్న రాష్ట్రం కేసీఆర్ వచ్చాక ఆ చీకట్లను చేదించి రాష్ట్రం మొత్తం కరెంట్ వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ దే. తెలంగాణ వస్తే కరెంట్ కష్టాలు, నీటి యుద్ధాలన్న ఆంధ్రా మాజీ సీఎం, నేతల మాటలను కేసీఆర్ వమ్ము చేసి కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు కట్టి సస్యశ్యామలం చేశారు. వ్యవసాయంలో పురోగతి సాధించి ఇప్పుడు దేశానికే అన్నపూర్ణగా తెలంగాణను మార్చారు.

Telangana Formation Day 2022

రైతుబంధు, రైతు బీమా, వ్యవసానికి ఉచిత కరెంట్, దళితబందు, ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించడంతో ఇప్పుడు తెలంగాణలో భూగర్భ జలం ఎగబాకి కుప్పలు, రాశులుగా పంటలు పండాయి. తెలంగాణ పల్లెలలన్నీ పచ్చబడ్డాయి.

సంక్షేమంలోనూ కేసీఆర్ గొప్ప ఫలితాలు రాబట్టారు. వృద్ధులు,వితంతువులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, గొర్రెలు పంపిణీ, మత్య్సకారులకు చేపల పిల్లలు ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ అభివృద్ధికి దోహదపడ్డారు. ఇక ఐటీ, పారిశ్రామిక రంగాల్లో కేటీఆర్ కృషితో హైదరాబాద్ దూసుకెళుతోంది. ఇలా ఎనిమిదేళ్లలో తెలంగాణ ఎంతో సాధించింది. నాటి కష్టాలను అధిగమించి నేడు ఠీవీగా నిలబడింది.

Also Read:CM Jagan-BJP: ఏపీ సర్కారుకు భలే చాన్స్.. జగన్ కేంద్రంతో కలబడతారా? కలిసిపోతారా?

Recommended Videos:


Tags