ED Summons Sonia And Rahul: దేశంలో ఇప్పుడు పవర్ ఫుల్ వ్యక్తి ఎవరంటే ప్రధాని నరేంద్రమోడీ. ఆయన ప్రత్యర్థులు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. వీరిద్దరూ ప్రస్తుతం మోడీని ఎదుర్కొనే స్టేజ్ లో లేరు. అయినా ప్రజల్లో వ్యతిరేకత వస్తే వాళ్లే హీరోలు అయిపోతారు. అలా రాకుండానే సోనియా, రాహుల్ లూప్ హోల్స్ లాగి మరీ వారిపై అవినీతి ముద్రను విజయవంతం వేసేస్తున్నారు మోడీ సార్..
సోనియా, రాహుల్ చేసిన అవినీతిని గతంలోనే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వెలికితీశారు. ఇప్పుడు దాన్నే వారి మెడకు చుట్టు ప్రజల్లో చులకన చేసే ఎత్తుగడను బీజేపీ అధిష్టానం చాకచక్యంగా చేస్తోంది. ఈ తల్లికొడుకుల అవినీతిని దేశవ్యాప్తం చేస్తోంది.
Also Read: Corruption In Aarogyasri: పేదల వైద్యం పక్కదారి.. ఆరోగ్యశ్రీ అవినీతిమయం
జాతీయ మీడియా అయిన నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు ఇప్పుడు సోనియా, రాహుల్ మెడకు చుట్టుకుంది. ఈ కేసులో జూన్ 8న దర్యాప్తు సంస్థ ఈడీ ముందు హాజరు కావాలని నోటీసులు జారీచేసింది. కేంద్రంలోని ఈడీ బీజేపీ చెప్పుచేతల్లో ఉండడంతో ఇది కక్షసాధింపు అని కాంగ్రెస్ అంటోంది. కానీ సోనియా, రాహుల్ ల అవినీతి అని బీజేపీ వాదిస్తోంది.
నేషనల్ హెరాల్డ్ ఆస్తులను అయాచితంగా పొందారంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలోనే ఫిర్యాదు చేయగా దీనిపై కేసు నమోదైంది. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సోనియా రాహుల్ నేరపూరిత కుట్ర పన్నారని సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదు చేశారు. దీంతో సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై కోర్టులో కేసు నమోదైంది. 50 లక్షలకే 90 కోట్ల నేషనల్ హెరాల్డ్ ను దక్కించుకునే కుట్రలో సోనియా, రాహుల్ దొరికిపోయారు.
ఇప్పుడు ఈ కేసును వారి మెడకు చుట్టి రాజకీయంగా.. ప్రజల్లో దెబ్బతీయాలని బీజేపీ చూస్తోంది. రాజకీయాల్లో అప్రమత్తంగా లేకుంటే ఇలా అవినీతి చేస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోవడం ఖాయం. ఈ అవినీతి మరకతోనే కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. మళ్లీ అదే ఊబిలో కూరుకుపోతోంది. ఇది బీజేపీకి ఆయాచిత వరమైంది.
Also Read:AP Tenders: ఏపీ టెండర్లలో కొత్త రూల్.. పనులు చేయాలి కానీ డబ్బులడగొద్దు