ED Raid Punjab: మనదేశంలో వ్యవస్థలు గొప్పగా ఉన్నాయని చెప్పుకుంటాం. అవి సమర్థవంతంగా పనిచేస్తుంటాయని గొంతులు చించుకుంటాం. మన దేశం చాలా గొప్పదని.. మన వ్యవస్థను నిర్మించిన వ్యక్తులు అద్భుతమైన వారిని పదేపదే అంటుంటాం. కానీ వ్యవస్థలో లోపాలు మనకు శాపాలని.. ఎదుగుదలకు అవే లోపాలని మనం గుర్తించం.
ఆ మధ్య ఒడిశా రాష్ట్రంలో ఓ మహిళ చనిపోయింది. ఆమె తీవ్ర అనారోగ్యం వల్ల చనిపోయింది. ఆమెకు ఓ తమ్ముడు ఉన్నాడు. ఆమెకు అనారోగ్యం సోకినప్పుడు అతడే చూసుకున్నాడు. చివరికి విషమించి ఆమె చనిపోయింది. ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులను తీసుకోవడానికి ఆమె తమ్ముడు బ్యాంకుకు వెళ్ళాడు. అనేక పర్యాయాలు బ్యాంకుకు వెళ్లినప్పటికీ అక్కడ సిబ్బంది రకరకాల షరతులు విధించారు. దీంతో అతడు ఈసారి ఏకంగా తన అక్క మృతదేహాన్ని పాతిపెట్టిన చోటు నుంచి వెలికి తీసి బ్యాంకుకు తీసుకెళ్లాడు. దీంతో బ్యాంకు అధికారులు కంగారుపడ్డారు. ఆ తర్వాత డబ్బును వడ్డీతో సహా ఇచ్చేశారు.
మనదేశంలో సామాన్యుల విషయంలో అనేక రకాల నిబంధనలు.. అనేక రకాల షరతులు విధించే వ్యవస్థలు.. పెద్దలు.. ప్రజలను మోసం చేసేవారి విషయంలో మాత్రం సలాం కొడుతుంటాయి. అటువంటిదే ఈ సంఘటన కూడా. పైగా మనదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందుగానే నోట్ల కట్టలతో దర్జాగా పారిపోయారంటే దానిని ఏమని చెప్పాలో.. దానిని ఎలా వివరించాలో కూడా అర్థం కావడం లేదు.
పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు దాడులు నిర్వహించారు. దాడులు నిర్వహిస్తుండగా.. 500 నోట్ల కట్టలతో నిండిన రెండు బ్యాగులను కొంతమంది వ్యక్తులు కిందికి వ్యతిరేశారు. ఆ తర్వాత ఒక వాహనంలో అక్కడికి వచ్చిన డ్రైవర్.. ఆ బ్యాగ్రౌండ్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఎయిర్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదురుగానే వారు ఈ పని చేయడం విశేషం.
గ్రేటర్ మొహాలి ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో భూ వినియోగ అనుమతుల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వినిపించాయి.. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నితిన్ గోహల్ అనే వ్యక్తి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడు పంజాబ్ ముఖ్యమంత్రి ఓ ఎస్ డి కి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్, చండీగఢ్ ప్రాంతాలలోని పలువురు బిల్డర్లు.. స్థిరాస్తి వ్యాపారులకు సంబంధించిన కంపెనీలలో గురువారం అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలోనే మొహాలలోని ఖరార్ అనే ప్రాంతంలో అపార్ట్మెంట్లోకి అధికారులు చేరుకున్నారు. ఆ అపార్ట్మెంట్ 9 వ అంతస్తు నుంచి 500 నోట్ల కట్టలతో నిండిన రెండు సంచులను గుర్తు తెలియని వ్యక్తులు కింద పడేశారు. అదే సమయంలో ఒక వాహనం అక్కడికి వచ్చింది. అధికారులు చూస్తుండగానే డ్రైవర్ ఆ బ్యాగులను తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే దీనిపై అధికారికంగా ఇంతవరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్పందించలేదు.