https://oktelugu.com/

Rakul Preet Singh : డ్రగ్స్ మూలాలు.. స్టార్ హీరోయిన్ రకుల్ కు ఈడీ షాక్

Rakul Preet Singh : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను దర్యాప్తు సంస్థలు వేటాడుతున్నాయి. ఇదివరకే ఒకసారి డ్రగ్స్ కేసులో రకుల్ ను ముంబై పోలీసులు విచారించారు. అప్పట్లో రకుల్ సహా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను డ్రగ్స్ కేసులో ఆరాతీశారు. ఆ కేసు ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ పై సినీ ఇండస్ట్రీలో ఒక గాసిప్ ఉంది. ఈ అమ్మడు అవకాశాలు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2022 / 02:09 PM IST
    Follow us on

    Rakul Preet Singh : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను దర్యాప్తు సంస్థలు వేటాడుతున్నాయి. ఇదివరకే ఒకసారి డ్రగ్స్ కేసులో రకుల్ ను ముంబై పోలీసులు విచారించారు. అప్పట్లో రకుల్ సహా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లను డ్రగ్స్ కేసులో ఆరాతీశారు. ఆ కేసు ముగిసిపోయిందనుకుంటున్న సమయంలో తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది.

    ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ పై సినీ ఇండస్ట్రీలో ఒక గాసిప్ ఉంది. ఈ అమ్మడు అవకాశాలు లేక డిప్రెషన్ లో డ్రగ్స్ తీసుకుందని ఒక ప్రచారం ఉంది. ఈమె కూడా తాను డిప్రెషన్ లో మందులు వాడనని.. తట్టుకోలేకపోయానని ఒకనొక సందర్భంలో చెప్పుకొచ్చింది. ఈమె డ్రగ్స్ వ్యవహారం ఆనోటా ఈనోట బయటపడి కేసుల వరకూ వెళ్లిందని అంటున్నారు.

    ప్రముఖ స్టార్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కు తాజాగా మరోసారి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేయడం సంచలనమైంది. ఈ కేసులో గత ఏడాది సెప్టెంబర్ 3న రకుల్ ను ఈడీ అధికారులు విచారించారు. అయితే అప్పుడు విచారణ మధ్యలోనే రకుల్ వెళ్లిపోయింది. నాడు ఆమెను పూర్తిస్థాయిలో విచారించని ఈడీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. తాజాగా రకుల్ ను విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది.

    2017 జులైలో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి సిట్ ఏర్పాటు చేసి పలువురు సినీ ప్రముఖులను విచారించారు. ఇక ఇదే కేసులో సెప్టెంబర్ లో ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కింద విచారణ చేపట్టారు.

    ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 22 వరకూ పలువురికి నోటీసులు జారీ చేసి ప్రశ్నించారు. ఈడీ విచారణకు నాడు పూరి జగన్నాథ్, రవితేజ, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్ , రానా, ముమైత్ ఖాన్, నందు, తనీష్, నవదీప్ తోపాటు రవితేజ డ్రైవర్ హాజరయ్యారు.

    ఇప్పటికే ముగిసిపోయిందనుకుంటున్న ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసును మళ్లీ ఈడీ తవ్వి తీస్తున్నట్టు తెలుస్తోంది. రకుల్ తోనే ఇది ఆగుతుందా? లేక మరికొందరు టాలీవుడ్ ప్రముఖులకు ఈ కేసు చుట్టుకుంటుందా? అన్నది వేచిచూడాలి.