https://oktelugu.com/

MLC Kavitha : నేడు ఈడీ విచారణ: కవిత అరెస్టు తప్పదా?

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సోమవారం ఉదయం భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆమె మంత్రి కేటీఆర్, భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఇతరత్రా న్యాయ నిపుణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఆమె ఈ డి విచారణ హాజరవుతారా? లేక గతంలో లాగానే చేస్తారా అనేది సందిగ్ధంలో ఉంది. ఈడి విచారణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్, […]

Written By:
  • Rocky
  • , Updated On : March 20, 2023 10:38 am
    Follow us on

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సోమవారం ఉదయం భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవిత ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆమె మంత్రి కేటీఆర్, భర్త అనిల్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఇతరత్రా న్యాయ నిపుణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఆమె ఈ డి విచారణ హాజరవుతారా? లేక గతంలో లాగానే చేస్తారా అనేది సందిగ్ధంలో ఉంది. ఈడి విచారణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత లీగల్ టీం తో సోమవారం ఉదయం సమావేశమయ్యారు.. విచారణకు హాజరు కావాలా? వద్దా? హాజరుకాకుంటే న్యాయపరంగా ఎలాంటి సమస్యలు వస్తాయి? అనే విషయాలపై తీవ్రంగా చర్చించారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ తో ఫోన్లో సంప్రదింపులు కూడా జరిపారు. పరిస్థితులకు అనుగుణంగా విచారణకు వెళ్లాలా? అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

    ఈనెల 16న కవిత రెండోసారి ఈ డి విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఆ రోజున ఢిల్లీలోనే ఉన్నా వెళ్లలేదు. తన ప్రతినిధిగా భారత రాష్ట్ర సమితి నేత, అడ్వకేట్ సోమ భరత్ కుమార్ ను ఈడి ఆఫీస్ కు పంపారు. నిబంధనల మేరకు ఈడీ విచారణ సాగడం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారించలేమని, ఈనెల 24న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తన పిటిషన్ పై నిర్ణయం ప్రకటించే వరకు విచారణకు రాలేనని అడ్వకేట్ ద్వారా ఈడికి కవిత చెప్పారు. మిత విజ్ఞప్తిని తోచిపోచిన ఈ డి ఈనెల 20 అంటే సోమవారం విచారణకు రావాలని మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కేవియట్ వేయటం, ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో సోమవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఒకరు కవితకు సూచించారు. సూచనతోనే కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. కాగా, మహిళ అయిన తనను ఇంటిదగ్గర విచారించేలా ఈడీ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల 14న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు, విచారణను ఈనెల 24 వాయిదా వేసింది. కవిత పిటిషన్ లో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కోరుతూ ఈడి సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.

    మరోవైపు కవిత ఢిల్లీకి వెళ్లిన నేపథ్యంలో ఈడీ అధికారులు ఆమెను అరెస్టు చేయొచ్చు అంటూ ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి విచారణకు హాజరు కాకపోవడంతో కవితపై ఈడి అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. కేవియట్ దాఖలు చేశారు. అంతేకాదు తమ విచారణకు కచ్చితంగా హాజరు కావాలని కవితకు సమన్లు జారీ చేశారు. అయితే బలమైన సాక్షాధారాలు కోర్టుకు చూపించి కవితను ఈడి అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటివరకు లిక్కర్ స్కామ్ లో కీలక నిందితులుగా ఉన్న వ్యక్తుల్ని ఈడి ఇదేవిధంగా అరెస్టు చేసింది.. అయితే కవితను అరెస్టు చేయకుంటే ఈ డి పనితీరుపై ప్రజల్లో సందేహాలు వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్షాలు కూడా లిక్కర్ స్కాంలో ఈడి పనితీరును ప్రశ్నిస్తున్నాయి. సోమవారం జరిగే విచారణకు హాజరు కాకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉన్న నేపథ్యంలో కవిత ముందుగానే ఢిల్లీ వెళ్ళినట్టు ప్రచారం జరుగుతోంది. వైపు ఆమెకు సలహాలు ఇస్తున్న న్యాయవాదులు కూడా విచారణకు హాజరు కావాల్సిందే అని చెబుతున్నారు.

    ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి శనివారం విచారణకు హాజరు కాలేదు. ఈ కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు మాగుంట రాఘవ అరెస్టు అయ్యారు. లిక్కర్ స్కామ్ లో తాను కవిత బినామీ అనే విచారణలో ఒప్పుకున్న అరుణ్ రామచంద్ర స్టేట్మెంట్ డ్రా చేసుకునేందుకు రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. కవిత పేరు ప్రస్తావించకుండానే ఈడి ఆమె సెంట్రిక్ గానే దానిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. కవితతో పాటు అరుణ్ రామచంద్ర, కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కన్ ఫ్రంటేషన్ విచారణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అరుణ్ రామచంద్ర కస్టడీని కోర్టు పొడిగిస్తూ వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో కవిత సోమవారం విచారణకు హాజరైతే… మరిన్ని కీలక ఆధారాలు రాబట్టాలని ఈడి అధికారులు యోచిస్తున్నారు. ఒకవేళ కవిత సమాధానం చెప్పని పక్షంలో అరెస్టు చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని సీనియర్ న్యాయ నిపుణులు అంటున్నారు.