https://oktelugu.com/

KTR: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. కేటీఆర్ సంచలన ప్రకటన!

KTR: తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో నంబర్ 2 అయిన కేటీఆర్ మాట్లాడితే దానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో విధాన కీలక నిర్ణయాలన్నీ ఈ తండ్రీ కొడుకులే తీసుకుంటారు. అందుకే వీరిద్దరు చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్ ఉంది. వీరు ఏం చేస్తే రాష్ట్రం ఆ విధంగా మారుతుంది. చూస్తుంటే తండ్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏలడానికి వెళ్లి రాష్ట్ర రాజకీయాలను మంత్రి కేటీఆర్ కు అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో రోజురోజుకు […]

Written By:
  • NARESH
  • , Updated On : June 11, 2022 / 10:02 PM IST
    Follow us on

    KTR: తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో నంబర్ 2 అయిన కేటీఆర్ మాట్లాడితే దానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో విధాన కీలక నిర్ణయాలన్నీ ఈ తండ్రీ కొడుకులే తీసుకుంటారు. అందుకే వీరిద్దరు చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్ ఉంది. వీరు ఏం చేస్తే రాష్ట్రం ఆ విధంగా మారుతుంది. చూస్తుంటే తండ్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏలడానికి వెళ్లి రాష్ట్ర రాజకీయాలను మంత్రి కేటీఆర్ కు అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

    ఇక తెలంగాణలో రోజురోజుకు పెరిగిపోతున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి కేసీఆర్, టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కదులుతున్నట్టు తెలుస్తోంది. దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను తమ సలహాదారుగా పెట్టుకొని ఆయన చెప్పినట్టు చేస్తోంది.

    ఈ క్రమంలోనే తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వాటికి బలాన్ని ఇచ్చేలా తాజాగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇవిప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో పెను సంచలనానికి దారితీసింది.

    తెలంగాణలో రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు మంత్రి కేటీఆర్ బాంబు పేల్చారు. బీజేపీ, కాంగ్రెస్ లు అనుమానిస్తున్నట్టే కేసీఆర్, కేటీఆర్ తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్టు తేటతెల్లమైంది. ఇక పీకే సర్వేలో తేలినట్టు కొంతమంది సిట్టింగ్ స్థానాలు వదులుకోవాల్సి వస్తుందని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలపై వ్యతిరేకతను తగ్గించుకోవడానికే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

    ఇక తెలంగాణలో ప్రశాంత్ కిషర్ సర్వేలో టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని తేలింది. ఈ ఊపులో కేసీఆర్ జాతీయ పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 18 లేదా 19న ఢిల్లీలో జాతీయ పార్టీకి రూపురేఖలు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

    తెలంగాణలో అధికారమే లక్ష్యంగా గ్రూప్ రాజకీయాలు ఉండకూడదని..కలిసికట్టుగా పని చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చాడు. దేశంలో రాష్ట్రంలో ఒక నూతన అధ్యాయం సృష్టించబోతున్నామని.. అది మన TRS తోనే సాధ్యమన్నారు.

    దేశం మొత్తం మన వైపు చూస్తోందని.. ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చాడు. మళ్ళీ అధికారం మనదేనంటూ చెప్పుకొచ్చాడు.

    రెండు సార్లు తెలంగాణలో అధికారం సంపాదించిన టీఆర్ఎస్ కు మూడో సారి గెలవడం కష్టమేనన్న అభిప్రాయాలున్నాయి. అయితే దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త పీకే తోడుగా టీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లి ఈ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ ప్లాన్లు వర్కవుట్ అవుతాయా? లేవా? అన్నది చూడాలి.

    Tags