Early Elections In AP: సాధారణం ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషన్లలో బదిలీలు, నూతన నియామకాలు ఉంటాయి. సాధారణ ఎన్నికల ముందు కసరత్తు ప్రారంభిస్తారు. కానీ ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ను కేంద్ర ఎన్నికల సంఘం మార్చేసింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న విజయానంద్ స్థానంలో కొత్తగా ముఖేష్ కుమార్ మీనాను నియమించింది. ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ నియామకం చేపట్టినట్లుగా ఈసీ తెలిపింది. విజయానంద్ 2019 జూన్‌లో నియమితులయ్యారు. ఆయన హయాంలో తిరుపతి, బద్వేలు ఉపఎన్నికలు జరిగాయి. ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల జగన్ సర్కారు కోరిన కోర్కెలను బీజేపీ పెద్దలు తీర్చుతున్నారు. ఇప్పటికే సీఎస్ శర్మ పదవీకాలం పొడిగించిన కేంద్రం జగన్ సర్కారు ఎడాపెడా చేస్తున్న అప్పులకు సైతం అనుమతిస్తోంది. కనీసం లెక్కా పత్రం చూపకపోయినా రుణాలకు పచ్చ జెండా ఊపుతోంది. ఇప్పుడు తాజాగా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మార్పు వెనుక కూడా జగన్ సర్కారు ఆమోద ముద్ర ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మరింత ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం ఏపీ సర్కారు పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. తీవ్ర ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇదే పరిస్థతి కొనసాగితే ఆ పార్టీకి పరాభవం తప్పదు. సంక్షేమ పథకాల మాటు దుబారా పెరిగిపోవడంతో ఆదాయానికి మించి వ్యయం చేయాల్సి వస్తోంది. ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలకు కష్టతరంగా మారుతోంది. ఐదేళ్లు పూర్తిస్థాయిలో ప్రభుత్వం నడపడం కష్టంగా జగన్ భావిస్తున్నారు. అందుకే కేంద్ర పెద్దల సహకారం తీసుకున్నారు. అందులో భాగంగానే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ మార్పుగా తెలుస్తోంది.
Also Read: Pragathi Hot pics: హాట్ సమ్మర్‌లో ‘చిల్’ ప్రగతి: సోషల్ మీడియాలో నటి రచ్చ.. వైరల్ పిక్స్..!!
సాధారణంగా ఎన్నికల కసరత్తును ప్రారంభించాలనుకునే సమయంలో రాష్ట్రాల్లో సీఈవోలను మారుస్తూ ఉంటారు. అధికారం ఉంటే తమకు అనుకూలంగా ఉండే అదికారులను.. నియమించుకోవడానికి పాలక పార్టీలు ఎక్కువగా ప్రయత్నిస్తూంటాయి. ఓటర్ల జాబితా దగ్గర్నుంచి ప్రతీది ఆయన కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. అందుకే అధికార పార్టీలు అనుకూలమైన వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాయి.ఏపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉందని అందుకే రాజకీయ కార్యకలాపాలు ఉద్ధృతం చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఈవోను మార్చడం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ముఖేష్ కుమార్ మీనా గతంలో గవర్నర్ కార్యదర్శిగా పని చేశారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర పెద్దలతో పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు భారీ మూల్యమే చెల్లించుకున్నారు. ఆ ఎన్నికల్లో వ్యవస్థల పరంగా చంద్రబాబుకు గట్టి దెబ్బే తగిలింది. జగన్ కు సంపూర్ణ సహకారం అందించింది. అందుకే జగన్ ఈ విషయంలో అచీతూచీ వ్యవహరిస్తున్నారు. కేంద్ర పెద్దలతో సఖ్యతగా మెలుగుతున్నారు. సంయమనంతో తాను అనుకున్నది సాధించగలుగుతున్నారు. వారి మెప్పు పొందుతున్నారు.
Also Read: NTR-ANR: ఇంత దిగజారుడు కథను ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఎలా ఒప్పుకున్నారు ?