AP Chief Election Officer: తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ‘ముందస్తు’ వ్యూహంలో భాగమే అన్నట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ను జాతీయ ఎన్నికల సంఘం మార్చేసింది. దీంతో జగన్ ప్రభుత్వం అలా ‘ముందుకు’ వెళ్లాలనుకుంటోందా? అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ను ఎన్నికల సంఘం మార్చేసింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న విజయానంద్ స్థానంలో కొత్తగా ముఖేష్‌కుమార్ మీనాను నియమించింది. ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ నియామకం చేపట్టినట్లుగా ఈసీ తెలిపింది. విజయానంద్ 2019 జోన్ లో నియమితులయ్యారు. ఆయన హయాంలో తిరుపతి, బద్వేలు ఉపఎన్నికలు జరిగాయి. ముఖేష్‌కుమార్ మీనా నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఎన్నికల సమయంలోనే మార్పు..
సాధారణంగా ఎన్నికల కసరత్తును ప్రారంభించాలనుకునే సమయంలో రాష్ట్రాల్లో సీఈవోలను జాతీయ ఎన్నికల కమిషన్ మారుస్తుంది. అధికారం ఉంటే తమకు అనుకూలంగా ఉండే అదికారులను.. నియమించుకోవడానికి పాలక పార్టీలు ఎక్కువగా ప్రయత్నిస్తూంటాయి. ఓటర్ల జాబితా దగ్గర్నుంచి ప్రతీది సీఈవో కనుసన్నల్లోనే నడుస్తుంది. అందుకే అధికార పార్టీలు అనుకూలమైన వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాయి. ఏపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉందని అందుకే రాజకీయ కార్యకలాపాలు వేగవంతం చేసిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఈవోను మార్చడం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. నూతన సీఈవోగా నియమితులైన ముఖేష్‌కుమార్ మీనా గతంలో గవర్నర్ కార్యదర్శిగా పని చేశారు.
గరంగరంగా ఏపీ పాలిటిక్స్..
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. ముఖ్యమంత్రి జగన్ ఇటీవలే మంత్రివర్గంలో మార్పులు చేశారు. ఎన్నికల కమిటీలను, పార్టీమెంట్ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను, కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఇటీవలే పార్టీ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు గెలవాలని లక్ష్యం నిర్దేశించారు. మరోవైపు వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా ఉంటున్నారు.
Also Read: IPL Virat Bad Time: ఐపీఎల్: విరాట్ కోహ్లీకి బ్యాడ్ టైం.. ఇంతటి దుస్థితి ఎప్పుడూ చూడలేదే?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు ఎన్నికలకు సమాయత్తం అన్నట్లు బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా జిల్లా్లల పర్యటన చేస్తున్నారు. తన సెంటిమెంట్ జిల్లా శ్రీకాకుళం నుంచి ఈ యాత్ర ప్రారంభించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజులు పర్యటించారు. మరోవైపు రాజకీయంగా త్యాగాలలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైసీపీని ఓడించేందుకు అందరూ ఏకం కావాలన్నారు. పొత్తులకు కూడా సిద్ధం అన్న సంకేతాలు ఇచ్చారు. అయితే బాబు ప్రకటనపై వైఎస్సార్‌సీపీ నేతలు స్పందిస్తున్నారు తప్ప బాబు ఆశించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, బీజేపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. పొత్తులు ఏమేరకు ఉంటాయన్నది వేచి చూడాలి..
జన సేనాని.. కౌలురైతు భరోసా యాత్ర
గత సెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించి కేడర్‌లోల నూతనోత్తేజం నింపారు. మరోవైపు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుబాలను పరామర్శిస్తున్నారు. నిత్యం జనంలోనే ఉంటే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమేరకు కార్యచరణ కూడా పార్టీ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఇక బీజేపీ కూడా రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొంటామంటోంది. ఇప్పటికే జనసేనతో అవగామన కుదుర్చుకున్న బీజేపీ వచ్చే ఎన్నికలల్లో తాము కీలకమవుతామని భావిస్తోంది. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఆంద్రప్రదేశలో రాజకీయాలపై చర్చించారు. తరావత ప్రస్‌మీట్లో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలలో అధికారంలోకి రావాలని హోం మంత్రి దిశానిర్దేశం చేశావరని ప్రకటించారు.
మొత్తంగా అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఏసీ సీఈవోను మార్చడం ముందస్తు ఎన్నికలు ఖాయమన్న సంకేతమే అని అన్ని పార్టీల నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.