కరోనా వైరస్ ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణలో కొంతకాలంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిలిచిపోయాయి. అయితే తాజాగా మందుబాబులకు షాకిచ్చేలా తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
క్రిస్మస్ వేడుకలు.. న్యూయర్ వేడుకల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సర్కార్ మళ్లీ డ్రంకెన్ డ్రైవ్ టెస్టు షూరు చేసింది. ఈమేరకు తెలంగాణ సర్కార్ రేపటి నుంచి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేలా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో శుక్రవారం నుంచి ట్రాఫిక్ పోలీసులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఫేస్ షీల్డ్‌లు ధరించి వాహనాలు ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రీత్ ఎనలైజర్‌కు శానిటేషన్ చేసి, ఫేసు షీల్డ్ ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రవ్ తనిఖీలు చేపడుతున్నారని సమాచారం.
కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తుందన్న నేపథ్యంలో ప్రతీఒక్కరు బహిరంగ వేడుకలకు దూరంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.