Hyderabad Pub Drugs: సినీ ప్రముఖులు దొరికారు.. ‘వాళ్లు’ పండుగ చేసుకుంటున్నారు..

Hyderabad Pub Drugs: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ వ్యవహరం అట్టుడుకుతోంది. ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఓ పబ్ పై పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఇందులో ఉన్న సెలబ్రెటీలతో సహా పలువురు యువకులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ డ్రగ్స్ వినియోగించారన్న వార్తలు జోరుగా వస్తున్నాయి. కానీ అందుకు సంబంధించిన విషయాలు పోలీసులు ధ్రువీకరించలేదు. ఎందుకంటే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిపై ఎలాంటి డ్రగ్స్ టెస్ట్ లు చేయించలేదు. అయితే ఇక్కడ కొన్ని కొకైన్ […]

Written By: NARESH, Updated On : April 4, 2022 9:43 am
Follow us on

Hyderabad Pub Drugs: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ వ్యవహరం అట్టుడుకుతోంది. ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఓ పబ్ పై పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఇందులో ఉన్న సెలబ్రెటీలతో సహా పలువురు యువకులు, యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడ డ్రగ్స్ వినియోగించారన్న వార్తలు జోరుగా వస్తున్నాయి. కానీ అందుకు సంబంధించిన విషయాలు పోలీసులు ధ్రువీకరించలేదు. ఎందుకంటే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిపై ఎలాంటి డ్రగ్స్ టెస్ట్ లు చేయించలేదు. అయితే ఇక్కడ కొన్ని కొకైన్ ప్యాకెట్లు లభించాయని మాత్రం చెబుతున్నారు. కానీ వాటిని ఎవరు వినియోగించారన్నది మాత్రం స్పష్టత లేదు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం లేపింది. హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిపోయిందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికార టీఆర్ఎస్ పై దాడిని మొదలుపెట్టాయి.

Hyderabad Pub Drugs

హైదరాబాద్ నగరంలోని ఫైవ్ స్టార్ హోటల్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ పై పోలీసులు జరిపిన దాడులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. వాస్తవానికి ఇలా వీకెండ్లో పబ్ లపై దాడులు చేయడం కొత్త కాదు. కానీ ఇప్పుడు పోలీసులు చెబుతున్న మాటేంటే.. అనుమతి లేకున్నా ఉదయం వరకు పబ్ ను నిర్వహిస్తున్నారని, అందుకే దాడులు చేయాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే సదరు పబ్ నిర్వాహకుడు ఏకంగా ఉదయం 3 గంటల వరకు పబ్ ఉంటుందని బోర్డే పెట్టాడు. అలాంటప్పుడు ఎక్సైజ్ శాఖ ఇన్ని రోజులు దానిపై దృష్టి పెట్టలేదా..? అని కొందరు అంటున్నారు. మరోవైపు నయానో.. బయానో అంతకుమించి పర్మిషన్ తీసుకుంటేనే కదా పబ్ ను నిర్వహించేది అని వాపోతున్నారు.

Also Read: AP New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. స్వరూపాలు.. అతిచిన్న జిల్లాకు ‘పర్యాటకం’ దూరం

పబ్ పర్మిషన్ ను ప్రభుత్వమే ఇచ్చినప్పుడు అందులోకి వెళ్లొద్దని ఎవరూ అనుకోరు. ఇతర పబ్ లో కంటే ఇందులో ఎక్కువ సమయం ఉన్నందునే ఇక్కడి వచ్చారని అంటున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీల పిల్లలంతా ఇందులోకి వెళ్లారు. అయితే పోలీసులు చెబుతున్న ప్రకారం సమయానికి మించి పబ్ ను నడుపుతున్నప్పుడు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఇందులోకి వచ్చిన వారిని అదుపులోకి తీసుకోవడం దేనికి..? అని ప్రశ్నిస్తున్నారు. ఇక కొకైన్ లభ్యమైందని పోలీసులు చెబుతున్నప్పటికీ దానిని వినియోగించారనడానికి మాత్రం ఆధారాలు చూపడం లేదు. దీంతో అసలు వీరిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారన్న వార్తలు వస్తున్నాయి.

Hyderabad Pub Drugs

పర్మిషన్ లేకుండా పబ్ లో డ్యాన్సు లేస్తున్నారంటూ దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపైన డ్రగ్స్ ముద్ర వేశారు. వారు వినియోగించారో.. లేదో.. ఎవరికీ తెలియదు. కానీ వారి పరువు మాత్రం పోయినట్లయింది. వాస్తవానికి పుడ్డింగ్ అండ్ మింక్ కు 24 గంటల పర్మిషన్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అందరినీ స్టేషన్ ను ఎందుకు తరలించాల్సి వచ్చింది. ఇదే సమయంలో మీడియాకు మంచి సరుకు దొరికిందన్నట్లుగా ఇబ్బడి ముబ్బడిగా ప్రచారం చేసింది. దీంతో కొందరు సెలబ్రెటీలో మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రం తమకు పోలీసులు సమాచారం ఇచ్చారని అంటున్నారు. అటు కమిషనర్ సైతం మీడియా ఎదుట డ్రగ్స్ గురించి మాట్లాడడంతో కొందరు సెలబ్రెటీలకు సంబంధించిన పిల్లల ఇమేజ్ దెబ్బతింది.

ఇదిలా ఉండగా సందట్లో సడేమియా లాగా రాజకీయ పార్టీలు దీనిని ఆసరాగా తీసుకొని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ కు డ్రగ్స్ టెస్ట్ చేయించాలని అంటున్నారు. హైదరాబాద్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం డ్రగ్స్ అడ్డాగా మారుస్తుందని అంటున్నారు. అయితే ఇందులో కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి కూతురు కూడా ఉన్నట్లు ప్రచారం చేశారు. అయితే డ్రగ్స్ కేంద్రాలకు అధికార పార్టీ అండ ఉంటే పోలీసులు ఎలా దాడి చేస్తారని కొందరు ప్రతి విమర్శలు చేసేవారు లేకపోలేదు. అయితే ఈ వ్యవహారం చివరికి ఎటు మలుపు తిరుగుతుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read:Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ : బన్నీ అభిమాని అవుట్

Tags