కన్నడ సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు డ్రగ్స్ దందా కప్పేసింది. ఈ డ్రగ్స్ దందాలో హీరోయిన్లు రాగిణి, సంజనలు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. సంజన ఇంట్లో తనిఖీలు చేయగా.. పోలీసులకు కీలక విషయాలు తెలిసినట్టు సమాచారం. శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసులో సౌత్ ఆఫ్రికా దేశ పౌరులే సూత్రధారులని సీసీబీ అనుమానిస్తోంది. ముఖ్య నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు 15 రోజుల క్రితం అరెస్ట్ చేశారు.
Also Read: మహాసముద్రం: శర్వాతో సై అంటున్న సిద్ధార్థ్ !
ఈ డ్రగ్స్ ముఠా సభ్యులు నటీమణులు రాగిణి, సంజనలతో కలిసి పార్టీల్లో పాల్గొన్నట్లు సీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ మంత్రి కుమారుడైన ఆదిత్య ఆళ్వ విదేశాలకు పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు.
ఆదిత్య ఆళ్వాకు చెందిన రిసార్ట్‌పై సీసీబీ పోలీసులు దాడి చేశారు. లూమా, ఉడేన్నాలు బెంగళూరులో మత్తు పదార్థాలను సరఫరా చేస్తుండగా వీరి వెనుక కూడా ఒక పెద్ద తలకాయ ఉన్నట్లు సీసీబీ గుర్తించింది. వీరిద్దరిని అరెస్ట్ చేస్తుండగానే ముగ్గురు కింగ్‌పిన్‌లు పరారు కావడంతో కేసుపై సీసీబీ గోప్యత పాటిస్తోంది. ఈ ముగ్గురు దొరికితే మరెంతోమంది క్లయింట్ల పేర్లు బయట పడవచ్చు. బెంగళూరుతో పాటు చుట్టుపక్కల రిసార్ట్ లో మధ్యరాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది.
Also Read: విజయ్ దేవరకొండకు నిర్మాణ సంస్థ సారీ
డ్రగ్స్ సరఫరా దారు పెప్పర్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బెనాల్ట్ ఉడేన్నా అనే ఆఫ్రికన్ ను అరెస్ట్ చేశారు. కన్నడ సినిమా రంగానికి చెందిన సెలెబ్రెటీలకు తామే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఉడేన్నా ఆదిత్యా ఆళ్వాకు చాలా సన్నిహితుడని.. డ్రగ్స్ నిందితులు రవిశంకర్, వీరేన్ ఖన్నాలు ఉడేన్నాతో నిత్యం సంప్రదించేవారని తెలిసింది. దీంతో దక్షిణాఫ్రికా పౌరులే ఈ డ్రగ్స్ దందాకు సూత్రధారులని పోలీసులు కనిపెట్టారు.