Homeజాతీయ వార్తలుDrugs Case: డ్రగ్స్ ఉచ్చు: డిఫెన్స్ లో కేటీఆర్.. వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి వార్

Drugs Case: డ్రగ్స్ ఉచ్చు: డిఫెన్స్ లో కేటీఆర్.. వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి వార్

Drugs caseDrugs Case: అధికార పార్టీ టీఆర్ఎస్ డైలమాలో పడుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలకు మంత్రి కేటీఆర్ సైతం అదే స్థాయిలో స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసును హైలెట్ చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లు ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకోని కేటీఆర్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పునుక్కున్నట్లుగా చేయడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం డ్రగ్స్ చుట్టూ తిరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి అధికార పార్టీనే లక్ష్యంగా తనదైన శైలిలో విమర్శలు చేస్తుండడంతో అందరిలో సందేహాలు వస్తున్నాయి.

అధికార పార్టీ టీఆర్ఎస్ ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దళిత, గిరిజన దండోరా సభల పేరుతో పోరు సాగిస్తోంది. దళితబంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలపై పదునైన పదజాలంతో విరుసుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ స్పందించడంపై అందరిలో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కథంతా మంత్రి కేటీఆర్ చుట్టూ తిరుగుతోంది. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను కేటీఆర్ చాలెంజింగ్ గా తీసుకుంటున్నారు. డ్రగ్స్ టెస్టులకు తాను సిద్ధమేనని ప్రకటిస్తూ సవాలు విసురుతున్నారు. నేను చేసుకుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా చేసుకుంటారా? అంటూ ప్రతిగా ప్రశ్నిస్తున్నారు. సినీ రంగ ప్రముఖులపై వచ్చిన డ్రగ్స్ కేసు ఇప్పుడు రాజకీయం అవుతోంది. ఎవరినో కాపాడే ప్రయత్నంలో కేటీఆర్ తన స్థాయి మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని వాదనలు వస్తున్నాయి.

మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై అదే తీరుగా ఆరోపణలు చేస్తున్నారు. ఆయనపై రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఆరోపణలకు ఇంతలా స్పందించడం ఎందుకని అందరి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ లో సహనం నశిస్తోందని తెలుస్తోంది. గతంలో ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా స్పందించని కేటీఆర్ ఇప్పుడు ఇంతలా ప్రతివిమర్శలు చేయడంతో అందరు ఆలోచనలో పడిపోతున్నారు. సవాళ్లకు సరైన విధంగా స్పందించాల్సి ఉన్నా అతిగా చేయడంపైనే ఆందోళన చెందుతున్నారు.

డ్రగ్స్ కేసు విషయంలో మంత్రి కేటీఆర్ ఇతరుల కోసమే ఇంతలా రెచ్చిపోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కేటీఆర్ అసహనం పెరుగుతుంటే రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదని చెబుతున్నారు. దీనిపై ఎవరి వాదనలు ఎలా ఉన్నా మంత్రి కేటీఆర్ మెడకు మాత్రం ఉచ్చు బిగుస్తుందని సమాచారం. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు గడ్డు రోజులు తప్పవేమోననే అనుమానాలు సైతం వస్తున్నాయి.

మరోవైపు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ సైతం కేటీఆర్ డ్రగ్స్ కేసులో తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారని ట్వీట్ చేశారంటే వ్యవహారం ఎంత దాకా వెళ్లిందో తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు చిక్కలు తప్పవేమోనని తెలుస్తోంది. కేటీఆర్ తనను తాను నిరూపించుకునే క్రమంలో ఆయన పడరాని పాట్లు పడుతున్నారని తెలుస్తోంది.

తెలంగాణలో టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే క్రమంలోనే డ్రగ్స్ కేసును వెలుగులోకి తీసుకొచ్చేలా పథకం రచించిందని సమాచారం. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా టీఆర్ఎస్ ను పావుగా చేయడంలో సక్సెస్ అయ్యిందనే తెలుస్తోంది. కేటీఆర్ ను బాధ్యుడిని చేస్తూ ఎదురుదాడికి దిగడంతో మంత్రి కేటీఆర్ మనుగడకే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ వేసిన వలలో కేటీఆర్ చిక్కుకున్నట్లు పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular