https://oktelugu.com/

మద్యం తాగితే కరోనా రాదట!

మద్యం తాగడం వల్ల కరోనా వైరస్ కి చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మద్యం షాపులను తెరవాలని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ కుందన్‌ పూర్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ కు లేఖ రాశారు. ఆ లేఖలో ఇంకా ఏముందంటే..”వైరస్‌ క్రిములను నిర్మూలించేందుకు ఆల్కహాల్‌ తో చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు గొంతులో తిష్టవేసే.. వైరస్‌ క్రిముల్ని చంపేందుకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 1, 2020 / 10:31 AM IST
    Follow us on

    మద్యం తాగడం వల్ల కరోనా వైరస్ కి చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కాబట్టి కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మద్యం షాపులను తెరవాలని రాజస్తాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ కుందన్‌ పూర్‌ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ కు లేఖ రాశారు.

    ఆ లేఖలో ఇంకా ఏముందంటే..”వైరస్‌ క్రిములను నిర్మూలించేందుకు ఆల్కహాల్‌ తో చేతులు శుభ్రం చేసుకుంటున్నప్పుడు గొంతులో తిష్టవేసే.. వైరస్‌ క్రిముల్ని చంపేందుకు మద్య వాడొచ్చుకదా, అలాగే మద్యం అమ్ముతూ స్వయం ఉపాధి పొందే వారికి, ప్రభుత్వానికి ఇదొక ఒక మంచి అవకాశం. మార్కెట్‌ లో మద్యానికి చాలా డిమాండ్ ఉంది. లాక్‌ డౌన్‌ నిషేధ సమయంలో ప్రభుత్వ ఆదాయం తీవ్రంగా దెబ్బతింటోంది. మద్యానికి బానిసైనవారి ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోంది. మద్యం అమ్మకాలకు కేంద్రం అనుమతించదు. అందువల్ల దానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది’అని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు.

    దేశవ్యాప్త లాక్‌ డౌన్‌ నేపథ్యంలో కఠినమైన ఆంక్షలు అమలవుతున్నాయి. అయితే, మద్యం షాపులను మూసేయడంతో.. మందు బాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే భరత్‌ సింగ్‌ తన లేఖలో ప్రస్తావించారు.