https://oktelugu.com/

డీఆర్డీవో కొత్త ఆవిష్కరణ.. 25 సెకన్లలో వైరస్‌ ఖతం

చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపచంలోని అన్ని దేశాలకు కరోనా వైరస్ పాకింది. పేద, ధనిక దేశాలనే తేడాలేకుండా కరోనా విజృంభిస్తుంది. కరోనా దాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడిపోతున్నాయి. భారత్ లోనూ కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులకు సరైన సదుపాయాలు లేనప్పటికీ వైద్యలు ధైర్యసాహసాలతో ముందుజాగ్రత్తలు తీసుకుంటూ పోరాడుతున్నారు. ఈనేపథ్యంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రెండు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 5, 2020 / 04:51 PM IST
    Follow us on


    చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం ప్రపచంలోని అన్ని దేశాలకు కరోనా వైరస్ పాకింది. పేద, ధనిక దేశాలనే తేడాలేకుండా కరోనా విజృంభిస్తుంది. కరోనా దాటికి అగ్రరాజ్యాలు సైతం విలవిలలాడిపోతున్నాయి. భారత్ లోనూ కరోనా ఎంట్రీతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యులకు సరైన సదుపాయాలు లేనప్పటికీ వైద్యలు ధైర్యసాహసాలతో ముందుజాగ్రత్తలు తీసుకుంటూ పోరాడుతున్నారు.

    ఈనేపథ్యంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కోసం రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) రెండు సరికొత్త ఆవిష్కరణలు చేసింది. ఇందులో పర్సనల్‌ శానిటైజేషన్‌ ఎన్‌క్లోజర్‌ ఒకటి. ఇందులో ఉండే షవర్‌ హైపో సోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని విడుదల చేస్తుంది. ఈ షవర్ కింద వైద్యులు 25సెకన్లపాటు నిలబడితే వారి దుస్తులపై ఉండే వైర్‌స్ లు నశిస్తాయి. ఈ ఎన్‌క్లోజర్‌ యంత్రంలో 700లీటర్ల హైపో సోడియం క్లోరైడ్‌ను నింపే వీలుంది. ఒక్కో ట్యాంకు ద్రావణం 650మంది డాక్టర్ల వ్యక్తిగత శుభ్రతకు ఉపయోగపడనుంది.

    అదేవిధంగా కరోనా రోగులకు వైద్యం అందించే డాక్టర్ల కోసం తేలికపాటి ఫేస్‌ ప్రొటెక్షన్‌ మాస్క్‌ను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇప్పటికే 100 ఫేస్‌ ప్రొటెక్షన్‌ మాస్క్‌లను ఈఎస్ఐసీ ఆసుపత్రులకు అందజేశారు. దీంతోపాటు మరో 10వేల మాస్కుల తయారీకి ఆర్డర్లు వచ్చాయని డీఆర్డీవో తెలిపింది. వీటిని త్వరలోనే వైద్యులకు పంపిణీ చేయనున్నట్లు డీఆర్డీవో తెలిపారు. ప్రస్తుత పరిస్థితులతో వైద్యుల రక్షణకు ఉపయోగపడేలా డీఆర్డీవో సరికొత్త ఆవిష్కరణలు చేయడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.