Donald Trump: చదువుతుంటే మతిపోతోంది కదూ. ఇదేంటి ఇలా అడుగుతున్నారని కోపం వేస్తోంది కాదు.. మీకంటే వందల రెట్లు మాకు కూడా కోపం వస్తోంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు స్థానంలో ఉన్న డోనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలకు చిరాకు వేస్తోంది. ప్రపంచ పెద్దన్నగా అమెరికాకు ప్రాధాన్యం ఉంది. ప్రపంచ దేశాలలో ఏదైనా జరిగితే అడిగే అధికారం కూడా ఉంది. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించే హక్కు కూడా ఆ దేశానికి ఉంది. అలాగని చెప్పి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ఎవరు ఊరుకుంటారు? నక్కకు నాక లోకానికి పోలిక పెడితే ఎవరు నిశ్శబ్దంగా ఉంటారు? అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉండి.. ప్రపంచ దేశాల పరిస్థితి తెలుసుకొని.. దానికి తగ్గట్టుగా మాట్లాడాల్సిన ట్రంప్.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. బూడిదనో పన్నీరు ను ఒకే జాబితాలో తెలిపారు. తాగే నీళ్లను, మురికి నీళ్లను ఒకే తీరుగా అభివర్ణించారు. అందువల్లే ట్రంప్ అంటే ఇప్పుడు ఇండియన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు.
Also Read: భారత్ కు ఎస్ – 500.. రష్యా బంపర్ ఆఫర్..
కటే ఎలా అవుతాయి
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది. నిర్మాణాలు, అభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు వంటి విభాగాలలో భారత్ దూసుకుపోతోంది. ఒకరకంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు తన ముఖచిత్రాన్ని ఎన్నో వేల రెట్లు మార్చేసుకుంది. అంతేకాదు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి తహతహలాడుతోంది. అలాంటి భారతదేశాన్ని ట్రంప్ పాకిస్తాన్ తో జతకట్టడం వివాదానికి కారణమవుతోంది. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న కఠిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ట్రంప్ విలేకరులతో మాట్లాడారు.. యుద్ధం ఆపకపోతే ఇరుదేశాలతో వ్యాపారాలు చేయబమని హెచ్చరించారు. భారత్ పాకిస్తాన్ శక్తివంతమైన దేశాలని.. ఈ గొడవల వల్ల జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. నిత్య యుద్ద పిపాసి అయిన ట్రంప్.. ఇప్పుడు శాంతి వచనాలు వల్లించడం ఒక జోక్ అయితే.. అన్నింటి కంటే ముఖ్యంగా పాకిస్తాన్ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంతో జట్టు కట్టడంతోనే వివాదం రేగుతోంది. ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు హోదాలో ట్రంప్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. స్థూల జాతీయోత్పత్తి.. ప్రపంచ వ్యాప్తంగా దేశానికి ఉన్న పరపతి.. ఏదైనా ఆపద వస్తే స్పందించే దేశాల సంగతి.. కేవలం వీటిని మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటే.. పాకిస్తాన్ అనేది ఇండియా దరిదాపుల్లో కూడా ఉండదు. ఈ విషయం గురించి తెలిసినప్పటికీ ట్రంప్ భారతదేశాన్ని, పాకిస్తాన్ ను ఒకే జాబితాలో చేర్చడం నిజంగా హాస్యాస్పదం. ఇప్పటికైనా విషయ పరిజ్ఞానం తెలిసిన పిఆర్ఓ లను అమెరికా అధ్యక్షుడు పెట్టుకోవాలని నెటిజెన్లు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు.