Homeజాతీయ వార్తలుDonald Trump : విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ ఉక్కుపాదం.. నెల రోజుల్లో వెయ్యి మంది వీసాలు...

Donald Trump : విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ ఉక్కుపాదం.. నెల రోజుల్లో వెయ్యి మంది వీసాలు రద్దు

Donald Trump : మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ నినాదంతో అధికారంలోకి వచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌.. తన అసంబద్ధ, అనాలోచిన నిర్ణయాలతో ఇటు ప్రపంచ దేశాలను, అటు అమెరికన్లను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇష్టానుసారంగా ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించారు. ఇప్పుడు అమెరికా యూనివర్సిటీల్లో(America Universities) చదువుతున్న వివిధ దేశాల విద్యార్థులను టార్గెట్‌ చేస్తున్నారు. ఇప్పటికే హమాస్‌ మద్దతు దారుల వీసాలు రద్దు చేశారు. మాహనాలు స్పీడ్‌గా నడిపినా వీసా రద్దు చేస్తామని ప్రకటించారు. యూనివర్సిటీల నిధుల్లో కోత విధించారు. విదేశీ విద్యార్థుల సోషల్‌ మీడియా ఖాతాల(Social Media Accounts) పైనా నిఘా పెట్టారు. గత కొన్ని వారాల్లో 1,000 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలు లేదా చట్టబద్ధ హోదాలు రద్దయ్యాయని అసోసియేటెడ్‌ ప్రెస్‌ అంచనా వేసింది. హార్వర్డ్, స్టాన్ఫర్డ్, ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలతో పాటు చిన్న కాలేజీల విద్యార్థులు కూడా ఈ చర్యల బారిన పడ్డారు. మార్చి చివరి నుంచి 160 కాలేజీల నుంచి సేకరించిన సమాచారం ఈ ఆందోళనకర పరిస్థితిని వెల్లడిస్తోంది. వీసా రద్దు కారణంగా నిర్బంధం, డిపోర్టేషన్‌ ముప్పు విద్యార్థులను కలవరపెడుతోంది.

Also Raed : మాయ చేసిన మెలోనీ.. భేటీ తర్వాత మెత్తబడ్డ ట్రంప్‌..!

వీసా రద్దుకు కారణాలు..
డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్లా్యండ్‌ సెక్యూరిటీ (DHS) వీసా రద్దులకు అనేక కారణాలు చూపుతున్నప్పటికీ, చిన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ప్రధానంగా కనిపిస్తున్నాయని కాలేజీలు తెలిపాయి. కొన్ని సందర్భాల్లో విద్యార్థులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే దానిపై స్పష్టత లేదు. ‘‘ఈ చర్యలు దేశవ్యాప్తంగా విద్యార్థి వీసాలను భారీగా రద్దు చేసే విధానంలో భాగమని అనుమానం కలుగుతోంది,’’ అని మిషిగాన్‌ యూనివర్సిటీ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈఏ అధికారుల నుంచి ఇంతవరకు స్పష్టమైన సమాధానం రాలేదు.

విద్యార్థుల న్యాయ పోరాటం..
వీసా రద్దు చర్యలను సవాలు చేస్తూ విద్యార్థులు న్యాయస్థానాలకు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వం సమర్థనీయ కారణాలు లేకుండా వీసాలను రద్దు చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. న్యూ హ్యాంప్‌షైర్, మిషిగాన్‌ వంటి ప్రాంతాల్లో విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లు ఈ అంశాన్ని లేవనెత్తాయి. ఈ చర్యలు నిబంధనలకు విరుద్ధమని, విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి.

వీసా రద్దు పరిణామాలు
వీసా రద్దైన విద్యార్థులు ఇమిగ్రేషన్‌ అధికారుల చేతిలో నిర్బంధం, డిపోర్టేషన్‌ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. భయాందోళనలతో కొందరు విద్యార్థులు చదువు పూర్తి చేయకుండానే స్వదేశానికి తిరిగి వెళ్తున్నారు. ఈ చర్యలు అమెరికాలో ఉన్నత విద్యను ఎంచుకునే విదేశీ విద్యార్థులను నిరుత్సాహపరుస్తాయని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు విదేశీ విద్యార్థులు గణనీయంగా సహకరిస్తున్న నేపథ్యంలో, ఈ విధానాలు దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

కాలేజీల స్పందన..
కొన్ని కాలేజీలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఫెడరల్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. మరికొన్ని సంస్థలు విద్యార్థులకు జాగ్రత్తలు

Also Read : ట్రంప్ ఆరంభించిన వ్యాపార యుద్ధం పద్మవ్యూహం లాంటిది

Exit mobile version