KCR BJP: బీజేపీని ఎదుర్కొనే సత్తా కేసీఆర్ కు ఉందా? నెక్ట్స్ ప్లాన్ ఏంటి? అంతుపట్టని తెలంగాణ సీఎం రాజకీయం?

KCR BJP:  తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమాల్లో బాలయ్య బాబులా తొడగొడుతున్నాడు.. కేంద్రంలోని బీజేపీని చీల్చి చెండాడుతున్నాడు. మొన్నటి వరకూ బీజేపీ అంటే భయం, భక్తితో వ్యవహరించిన కేసీఆర్ ఎందుకు ఇంతలా తెగించాడు? కేసీఆర్ ధైర్యానికి కారణమేంటి? కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని కేసీఆర్ ఎదురించగలడా? కేసీఆర్ అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇంతకీ కేసీఆర్ రాజకీయం ఏంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ […]

Written By: NARESH, Updated On : February 14, 2022 1:26 pm
Follow us on

KCR BJP:  తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమాల్లో బాలయ్య బాబులా తొడగొడుతున్నాడు.. కేంద్రంలోని బీజేపీని చీల్చి చెండాడుతున్నాడు. మొన్నటి వరకూ బీజేపీ అంటే భయం, భక్తితో వ్యవహరించిన కేసీఆర్ ఎందుకు ఇంతలా తెగించాడు? కేసీఆర్ ధైర్యానికి కారణమేంటి? కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని కేసీఆర్ ఎదురించగలడా? కేసీఆర్ అడుగులు కాంగ్రెస్ వైపు పడుతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఇంతకీ కేసీఆర్ రాజకీయం ఏంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

Modi and KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యుహాలు ఎవరికీ అర్థం కావంటారు. ప్రత్యర్థులను వ్యంగ్యంగా తనదైన శైలిలో విమర్శించడంలో కేసీఆర్ దిట్ట. అదే సమయంలో విలువలు పాటించడమూ తెలుసు. నిన్న మళ్లీ కేసీఆర్ రెచ్చిపోయారు. అయితే పద్ధతిగానే బీజేపీని కడిగిపారేశారు. తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తీరు చూస్తుంటే బీజేపీకి పూర్తిగా వ్యతిరేకంగా.. కాంగ్రెస్ వాదులకు అనుకూలంగా మారుతున్నట్టు కనిపిస్తోంది.

కేసీఆర్ తీరు చూస్తుంటే క్రమంగా బీజేపీకి దూరంగా.. కాంగ్రెస్ కు దగ్గరగా అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో రాహుల్ గాంధీకి సీఎం కేసీఆర్ మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. రాష్ర్టంలో తనకు ప్రధాన ప్రత్యర్థిగా భావించే కాంగ్రెస్ అధినేతకు మద్దతుగా మాట్లాడడమే ఇందుకు కారణం. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. . అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ గాంధీపై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ తండ్రెవరో ఆధారాలు అడిగామా అంటూ ప్రశ్నించడంపై కేసీఆర్ మండిపడ్డారు. అసోం సీఎం మాటలు చాలా దారుణమని.. అవి భారతీయ సంస్కృతిని విస్మరించడమేని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి మన సంస్కృతిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. తక్షణం బిశ్వశర్మను సీఎం పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

కొంత కాలంగా బీజేపీతో ఢీ అంటే ఢీ అనే విధంగా కేసీఆర్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. నేరుగా ప్రధాని మోడీపైనే విమర్శలు చేస్తున్నారు. అవసరమైతే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారు. కానీ జాతీయ స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలతో ఒక కూటమిగా ఉండగా, బీజేపీ ఎన్డీఏ కూటమి ఉంది.. గత ఎన్నికల నుంచే తాము మూడో ఫ్రంట్ వైపు వెళ్తామని కొంత కాలంగా చెప్పుకొస్తున్నారు. భువనగిరి సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

మొన్నటి వరకు కాంగ్రెస్ ను చెడామడా తిట్టిన కేసీఆర్ ఒక్కసారిగా రాహుల్ మద్దతు పలుకడంపై పలువురు ఆశ్చర్యపోతున్నారు. కరోనా మొదటి వేవ్ సమయంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి మద్దతుగా నిలిచారు. దేశ ఐక్యతను చాటాలని ప్రధాని పిలుపునివ్వగా సీఎం కేసీఆర్ పూర్తిగా సహకరించారు. ఆ సమయంలో చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం వంటి కార్యక్రమాలకు ప్రధాని పిలుపునివ్వగా కొందరు సోషల్ మీడియాలో వ్యంగ్యంగా పోస్టలు పెట్టారు. దీనిపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మన ఐకమత్యాన్ని చాటాలని దేశ ప్రధాని పిలుపునిస్తే ఇంత హీనంగా వ్యవహరిస్తారా అని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని గుర్తించి అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు.

ప్రస్తుతం అసోం సీఎం పై కేసీఆర్ మండిపడడంపై భిన్న చర్చలు సాగుతున్నాయి. దేశంలో నాన్ కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలతో కలిసి జాతీయ స్థాయిలో మూడో ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తరచూ చెబుతున్న కేసీఆర్ ఇప్పడు కాంగ్రెస్ వైపు మళ్లతున్నాడా అనే చర్చలు సాగుతున్నాయి. రాష్ర్టంలో తనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అనే చెప్పుకొస్తున్నారు. అలాంటి పార్టీతో జట్టు కడతారా అనే అనునాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా రాష్ర్టంలో కాంగ్రెస్ తో కలిసి పని చేసే అవకాశాలు ఉంటాయా అని పలువురు సందేహిస్తున్నారు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. మిత్రులూ ఉండరు. ఏమో మున్ముందు ఏం జరుగుతుందో ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ ఓడిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ వైపో.. థర్డ్ ఫ్రంట్ వైపో మళ్లుతారు. బీజేపీ గెలిస్తే పరిస్థితులు మారుతాయి. కేసీఆర్ తీరు వచ్చే ఎన్నికలు పూర్తయితే కొంత మేర స్పష్టత రావచ్చు.