https://oktelugu.com/

Dwarampudi vs Jagan: జగన్ గాలిలో గెలిచావ్ ద్వారంపూడి.. పవన్ కళ్యాణ్ ను ఓడించే దమ్ముందా?

Does Dwarampudi have the guts to beat Pawan Kalyan? : కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అందరి సరదా తీరేస్తుంది. ఒకానొక సమయంలో కేవలం ఒక్కటంటే ఒక్క సీటునే తెచ్చుకొని దేశంలో బీజేపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించుకోలేదు. అలాంటి బీజేపీ ఇప్పుడు రెండు సార్లు ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా అధికారం వస్తుంది. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు.. అలాగని అలంకారం కూడా కాదు.. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిపోవచ్చు.. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2022 10:01 pm
    Follow us on

    Does Dwarampudi have the guts to beat Pawan Kalyan? : కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. అందరి సరదా తీరేస్తుంది. ఒకానొక సమయంలో కేవలం ఒక్కటంటే ఒక్క సీటునే తెచ్చుకొని దేశంలో బీజేపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా సాధించుకోలేదు. అలాంటి బీజేపీ ఇప్పుడు రెండు సార్లు ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా అధికారం వస్తుంది. అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదు.. అలాగని అలంకారం కూడా కాదు.. ఇప్పుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిపోవచ్చు.. ఈ దేశంలో ఎందరో మహానుభావులు ఓడిపోయారు. ఎన్టీఆర్ నుంచి కేసీఆర్, చంద్రబాబు, జగన్ ల వరకూ ఓడి అధికారానికి దూరం అయిన వారే.. కానీ తర్వాత గెలిచారు. గెలుపు అనేది ఒక్కరికే సొంతం కాదు.. ఆ గాలి.. వేవ్ ను బట్టి గెలుపు సొంతమవుతుంది.అధికార పక్షంపై వ్యతిరేకతనే పోయిన సారి జగన్ గెలుపును డిసైడ్ చేసింది. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సానుభూతి కూడా జగన్ కు వరంగా మారింది. వైసీపీని గెలిపించింది.

    ఒక ఎన్నికల్లో గెలుపోటములు అనేవి ప్రజలు తీక్షణంగా చూసి చాన్స్ ఇస్తారు. ఐదేళ్ల పాలననే గీటురాయిగా తీసుకొని ఓటేస్తారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ వేవ్ రావడానికి నాటి టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత.. చంద్రబాబు పాలన వైఫల్యం కూడా జగన్ గెలుపునకు కారణమైంది.

    జగన్ పై సానుభూతి.. గతంలో ఓడిపోయారని ఒక్క చాన్స్ అన్న పిలుపునకు ఏపీ ప్రజలు స్పందించారు. గంపగుత్తగా ఓటేశారు. ఆ గాలిలోనే ముక్కు మొహం తెలియని వారు కూడా వైసీపీ ప్రజాప్రతినిధులుగా గెలిచారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఎదురించిన ఒక సీఐ సైతం ఎంపీగా గెలిచారంటే వైసీపీ వేవ్ ఏ స్థాయిలో పనిచేసిందో అర్థం చేసుకోవచ్చు.

    జగన్ గాలిలో గెలిచిన వారంతా ఇప్పుడు తామ సొంత బలంతో గెలిచినట్టు వ్యాఖ్యానాలు చేస్తూ ప్రత్యర్థులను అవహేళన చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఓటమిని గేలి చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీచేసినా ఓడిస్తానంటూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అవాకులు చెవాకులు పేలుతున్నారు. పవన్ ఇటీవల 9వ ఆవిర్భావ సభలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. జనసైనికులను బాధపెట్టే రోజు వస్తుందంటూ వికటట్టహాసం చేశారు.

    అసలు ఈ ద్వారంపూడి, నానిలు అనే నేతలు జగన్ అధికారంలోకి రాకముందు ఎవరో తెలియదు. అంతకుముందు టీడీపీ సీనియర్లు ఎంతో మంది ఉన్నా ఇలా ప్రతిపక్ష నేతలను అవమానించేలా మాట్లాడిన దాఖలాలు లేవు. ప్రజాక్షేత్రంలో ప్రజలే గెలుపోటములు డిసైడ్ చేస్తారు. కానీ పవన్ ను ఎక్కడ పోటీచేసినా ఓడిస్తానని.. ద్వారంపూడి అహంకారపు మాటలను జనసైనికులు ఖండిస్తున్నారు. ప్రజల తీర్పును ఎవరైనా శిరసావహించాలి. దానికి ద్వారంపూడి అతీతులు కారు.. కానీ ప్రజలనే పక్కనపెట్టి ఓడిస్తానంటున్న ద్వారంపూడి మాటలు ఎవరూ సహించడం లేదు. ఇప్పటికైనా రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లకు చరమగీతం పాడకపోతే వచ్చే ఎన్నికల్లో ద్వారంపూడికి ఇదే గతి పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని జనసైనికులు విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పవన్ ను ఆపే దమ్ము అసలు వైసీపీకి లేదే లేదని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి విజయం ఎవరిది? ఎవరి సవాల్ నిలుస్తుందన్నది కాలమే సమాధానం ఇస్తుంది.

    Nadendla Manohar vs Dwarampudi Chandrasekhar || Mataku Mata || Ok Telugu