ప్రజలకు సేవా చేస్తావా? అంటే వర్మ సమాధానమిదీ

ఈ మధ్య సడెన్ గా దేశ సమస్యలు గుర్తొచ్చి ఆ మేరకు ట్వీట్లు చేస్తున్నాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరించిన తీరును ఆయన ట్వీట్లలో కడిగేశారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళాతోనే కరోనా కేసులు పెరిగాయని విమర్శించారు. ఎన్నడూ లేనిది వర్మలో ఇంతటి సామాజిక సృహ చూసి అందరూ అవాక్కయ్యారు. కొంప దీసి రాజకీయాల్లోకి వస్తారా? అని కూడా అనుమానపడ్డారు. దీనిపై రాంగోపాల్ వర్మనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]

Written By: NARESH, Updated On : May 13, 2021 7:09 pm
Follow us on

ఈ మధ్య సడెన్ గా దేశ సమస్యలు గుర్తొచ్చి ఆ మేరకు ట్వీట్లు చేస్తున్నాడు వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహరించిన తీరును ఆయన ట్వీట్లలో కడిగేశారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళాతోనే కరోనా కేసులు పెరిగాయని విమర్శించారు.

ఎన్నడూ లేనిది వర్మలో ఇంతటి సామాజిక సృహ చూసి అందరూ అవాక్కయ్యారు. కొంప దీసి రాజకీయాల్లోకి వస్తారా? అని కూడా అనుమానపడ్డారు. దీనిపై రాంగోపాల్ వర్మనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడిగేశారు. ప్రజా సమస్యలపై, కరోనాను అరికట్టలేకపోతున్న ప్రభుత్వాలపై విమర్శిస్తున్న మీరు రాజకీయాల్లోకి వస్తారా? ప్రజా సేవ చేస్తారా? అని ఓ తుంటరి జర్నలిస్టు.. అస్సలు సూట్ కానీ రాంగోపాల్ వర్మను అడిగేశారు. దానికి వర్మ సమాధానం విని షాక్ అయినంత పని అయ్యింది.

ప్రజలకు సేవ చేసే ఉద్దేశం తనకు లేదని కుండబద్దలు కొట్టారు వర్మ. తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. జనాలకు సేవ చేసే ఉద్దేశం నాకు భవిష్యత్ లోనూ అస్సలు లేదు. నాకు నేను చేసే చేసుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్న వాళ్లే పాలిటిక్స్ లోకి వస్తారు. అది నేను కాదు.. అని వర్మ స్పష్టం చేశారు.

అయితే నేతలపై వర్మ సెటైర్లు కూడా వేశారు. సహజంగానే ఏ నేత అయినా ఫేమ్, పవర్ కోసమే పాలిటిక్స్ లోకి అడుగుపెడుతాడు అని.. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పలేకనే ప్రజా సేవ అని పైకి చెబుతుంటాడు అని వర్మ తనదైన శైలిలో ట్విస్ట్ ఇచ్చాడు.