People Of Indian Origin Rule The Foreign Countries: అందుగలరు..ఇందులేరని సందేహంబు వలదు.. ఎందెందు వెతికినా మన భారతీయులే కలరు’ అని ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఏదేశమేగినా.. ఎందుకాలిడినా భారతీయుల ప్రతిభకు ప్రపంచమే దాసోహమవుతున్న పరిస్థితి నెలకొంది. ప్రపంచ టెక్ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్ నుంచి మొదలుపెడితే వివిధ దేశాలకు అధ్యక్షులు, ప్రధానుల వరకూ అంతా భారత సంతతి వారే. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా భారత ముద్దుబిడ్డనే. ఇప్పుడు బ్రిటన్ కాబోయే ప్రధాని రేసులో ఉన్న రిషి సునక్ కూడా మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడే కావడం విశేషం.
ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన భారత సంతతి వ్యక్తులు కనిపిస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపార కారణాలతో చాలా మంది భారతీయులు తమ ప్రతిభకు అవకాశాలున్న చోట్లకు వలస వెళుతున్నారు. విదేశాల్లోకి వెళుతున్నారు. వెళ్లడమే కాకుండా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. విద్యలోనూ.. వ్యాపారంలోనూ ఉన్నత స్థాయిలో ఉంటూ ఇండియా పేరును నిలబెడుతున్నారు. అయితే కొందరు రాజకీయంగా కూడా పట్టు సాధిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమల హారిస్ ఎన్నికవడంతో దేశంలో సంబరాలు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న రిషి సునక్ మనవాడే.. వీరు మాత్రమే కాకుండా చాలా మంది భారతీయులు వివిధ దేశాలకు అధ్యక్షులుగా,. ప్రధానులుగా ఎన్నికయ్యారు. వారి గురించి తెలుసుకుందాం.
Also Read: Sri Lanka Crisis- India: శ్రీలంక ఆర్థిక దుస్థితినుంచి గట్టెక్కించే భారత్ ‘రూపాయి’ ప్లాన్
-ప్రవింద్ జగన్నాథ్( మారిషన్ ప్రధానమంత్రి):
అఫ్రికా ఖండంలోని మారషన్ ఒక ద్వీప దేశం. ఇక్కడికి 1835లోనే కిష్టమ్, వెంకటపతి, అప్పయ్య అనే ముగ్గురు తెలుగువారు అడుగుపెట్టారు. కాకినాడ సమీపాన ఉన్న రేవు నుంచి బయలు దేరారు. ఇలా దాదాపు 200 మంది తెలుగువారు అక్కడికి పయనమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్ర విశ్వ విద్యాలయంలో డాక్టరేట్ సాధించిన ప్రవింద్ జగన్నాథ్ కూడా మారిషన్ వెళ్లి స్థిరపడ్డారు. అంచెలంచెలుగా ఎదిగి 2017లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఇక మారిషస్ అధ్యక్షుడిగా ఉన్న పృథ్వీరాజ్ సింగ్ రూపున్ కూడా మన భారత సంతతి వ్యక్తి కావడం విశేషం.
-అంటోనియా కోస్టా(పోర్చుగల్ ప్రధానమంత్రి):
పోర్చుగల్ ప్రధానమంత్రి అంటోనియా కోస్టా భారత సంతతికి చెందిన వ్యక్తే. ఈయన తండ్రి అర్నాల్డో డాక్టర్ కోస్టా గోవాకు చెందిన వారు. వ్యాపారం కోసం పోర్చుగల్ వెళ్లిన ఆయన అక్కడే స్థిరపడ్డారు. ఆ తరువాత అతని కుమారుడు ఆంటోనియా రాజకీయాల్లో పట్టు సాధించి ప్రధాని అయ్యారు. ఆంటోనియా కోస్టాను 2017లో భారత ప్రభుత్వం ‘ప్రవాసీ భారతీయ సమన్’ అనే అవార్డుతో సత్కరించింది.
-మహమ్మద్ ఇర్ఫాన్ (గయానా అధ్యక్షుడు):
ఇండో గయానా ముస్లిం కుటుంబంలో జన్మించిన మహమ్మద్ ఇర్ఫాన్ 2020లో గయానా దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. వెస్ట్ కోస్ట్ డెమరారాలోని లియోనోరాలో 1980 ఏప్రిల్ 25న జన్మించారు. 2006లో నేషనల్ అసెంబ్లీ ఆఫ్ గయానాలో సభ్యుడు అయినా ఆయన ఆ తరువాత వాణిజ్య శాఖ మంత్రిగా నియమితులయ్యాడు. ఆ తరువాత 2020లో అధ్యక్షుడయ్యాడు.
-చంద్రికా ప్రసాద్ సంతోఖి, సురినామ్ అధ్యక్షుడు: దక్షిణ అమెరికాలోని సురినామ్ దేశాధ్యక్షుడు చంద్రికా ప్రసాద్ సంతోఖి కొనసాగుతున్నారు. 1958 జన్మించిన ఆయన భారత మూలాలున్న వ్యక్తే.
కమల హ్యారీస్:(అమెరికా ఉపాధ్యక్షురాలు): భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆమె తల్లిదంద్రులు తమిళనాడుకు చెందిన వారు.
ఇప్పుడు భారత సంతతికి చెందిన రిషు సునక్ బ్రిటన్ ప్రధాన పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇక ప్రధాని, అధ్యక్షులుగానే కాదు.. ఎంపీలుగా, వైద్యులుగా, లాయర్లుగా ఆ దేశంలో చాలా మంది భారతీయులు అత్యున్నత స్థాయిలో ఇలా భారత్ కు చెందిన వారు విదేశాల్లో అధ్యక్షులుగా కొనసాగుతూ భారత పేరు నిలబెడుతున్నారు.ప్రపంచమంతా భారతీయుల ప్రతిభకు దాసోహం అవుతోంది. విద్య, ఉద్యోగాలే కాకుండా రాజకీయంగానూ మన భారతీయులు విదేశాల్లో తమదైన ముద్రవేస్తున్నారు. ముఖ్యంగా మనల్ని 200 ఏళ్లు బానిసలుగా పాలించిన బ్రిటన్ కు మన రిషి సునక్ ప్రధాని అయి పాలిస్తే మాత్రం అంతకంటే గౌరవం ఇంకొకటి ఉండదనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read:Venkaiah Naidu: బీజేపీలో వెంక్యయ్య నాయుడు పాత్ర ముగిసినట్టేనా?