https://oktelugu.com/

Lok Sabha And Rajya Sabha: లోక్ సభ, రాజ్య సభ మధ్య తేడా తెలుసా?

1954లో లోక్ సభ స్పీకర్ జి.వి. మౌలాంకర్ హౌస్ ఆఫ్ పీపుల్ కు లోక్ సభ అని నామకరణం చేశారు. ఇదొక తాత్కాలిక సభ. ఇందులో మొత్తం 552 గరిష్ఠ సభ్యులు ఉంటారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 23, 2024 / 12:45 PM IST

    Lok Sabha And Rajya Sabha

    Follow us on

    Lok Sabha And Rajya Sabha: రీసెంట్ గా లోక్ సభ, రాజ్యసభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మీలో ఎంత మంది ఓటు వేశారు? ఇక ఓటు గురించి, ఫలితాల గురించి పక్కన పెడితే లోక్ సభ, రాజ్యసభ అంటే ఏమిటి? ఇందులో ఎవరు ఉంటారు? రెండు సభలకు తేడా ఏంటి? అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా లోక్ సభ గురించి చదివేసేయండి.

    1954లో లోక్ సభ స్పీకర్ జి.వి. మౌలాంకర్ హౌస్ ఆఫ్ పీపుల్ కు లోక్ సభ అని నామకరణం చేశారు. ఇదొక తాత్కాలిక సభ. ఇందులో మొత్తం 552 గరిష్ఠ సభ్యులు ఉంటారు. ప్రస్తుతం లోక్ సభలో మొత్తం 545 సభ్యులు ఉన్నారు. ఈ సభకు పోటీ చేయాలి అంటే 25 సంవత్సరాలు ఉండాల్సిందే. ఒకసారి ఎన్నికైతే 5 సంవత్సరాల వరకు మాత్రమే కొనసాగుతారు. ఇక లోక్ సభలో ఒకపార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి అంటే 10 శాతం స్థానాలను కైవసం చేసుకోవాల్సిందే.

    మొట్టమొదట ప్రతిపక్ష నాయకుడు వై.బి. చవాన్ ఉండేవారు. ఈ సభకు సభ్యులను ప్రజలే ఎన్నుకుంటారు. ఇక రెండు సమావేశాల మధ్య కాల వ్యవధి 6 నెలలకు మించి ఉండకూడదు. ఇప్పుడు రాజ్యసభ గురించి తెలుసుకుందాం. ఇక రాజ్యసభను రాష్ట్రాల మండలి అని పిలుస్తారు. ఈ సభను 1954లో రాజ్యసభ అని నామకరణం చేశారు. దీన్ని మేధావుల, పెద్దల ఎగువ సభ అని పిలుస్తుంటారు. ఇది శాశ్వత సభ. ఇందులో సభ్యుల పదవీ కాలం ఆరు సంవత్సరాలు ఉంటుంది.

    ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తుంటారు. వీరి స్థానంలో కొత్త వారు వస్తుంటారు. ఇక గరిష్ఠంగా ఈ సభలోని సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. తెలంగాణకు ఇందులో 7 స్థానాలు ఉన్నాయి. ఆంధ్రకు 11 స్థానాలు ఉన్నాయి. రాజ్యసభకు పోటీ చేయాలి అంటే కనీసం 30 సంవత్సరాల వయసు ఉండాలి. ఉపరాష్ట్ర పతిని తొలగించే తీర్మానాన్ని కూడా ఈ సభలోనే ప్రవేశపెట్టాలి. మరి తెలుసుకున్నారు కదా రెండు సభల గురించి.. మరిన్ని ఇంట్రెస్ట్ విషయాల గురించి మన సైట్ ను ఫాలో అవుతూ ఉండండి..