Republic Day 2023: మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఆ రోజు దేశం స్వేచ్ఛావాయువులు పీల్చింది. ఎందరో త్యాగాలు చేసిన ఫలితంగా మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. దాదాపు 250 ఏళ్ల పోరాట ఫలితంగా స్వాతంత్ర్యం ఆవిష్క్రతమైంది. దీంతో మనం ఆ రోజును పండుగలా జరుపుకుంటాం. ఆ రోజు స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తుంటాం. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మన దేశ సార్వభౌమత్వాన్ని చాటడానికి మనకు అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకుంటాం.

ఇక గణతంత్ర దినోత్సవం అంటే మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకున్న రోజు. ప్రతి దేశానికి రాజ్యాంగం గుండెకాయ లాంటిది. మన జీవన విధానాన్ని శాసించేది రాజ్యాంగం. మనకు కల్పించే హక్కులు, విధులు చెబుతుంది. దీంతో మనం దేశంలో జీవించేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. చట్టాన్ని గౌరవించాలి. న్యాయాన్ని పరిరక్షించాలి. సక్రమంగా విధులు నిర్వహించి దేశం కోసం పాటుపడాల్సి ఉంటుంది. ఇదే రాజ్యాంగం. దీన్ని అమలు చేసుకున్న రోజును గణతంత్ర దినోత్సవంగా చెబుతారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు శ్రమించి రాజ్యాంగాన్ని తయారు చేశారు.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు వేడుకలు ఎర్రకోటలో చేస్తారు. ఈ రోజు జెండాను మన ప్రధానమంత్రి ఎగురవేస్తారు. స్వాతంత్ర్య రీత్యా మన దేశ బాధ్యతలు ప్రధానమంత్రి చేతులో ఉండటంతో ఆయనే పతాకావిష్కరణ చేస్తారు. దీంతో మన దేశంలో అమలయ్యే పథకాలు, వాటి అమలు తీరు బాధ్యతలు మొత్తం ప్రధాని ఆధ్వర్యంలో జరగడంతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దేశాభివృద్ధిలో ప్రధాని పాత్రే కీలకం. నిజమైన పాలన చేసేది ప్రధానమంత్రి. రాష్ట్రపతి రబ్బర్ స్టాంపులా ఉంటారు అంతే.

గణతంత్ర దినోత్సవం జనవరి 26న నిర్వహిస్తారు. ఈ రోజు వేడుకలు రాజ్ పథ్ లో జరుపుతారు. జెండాను రాష్ర్టపతి ఎగురవేస్తారు. రాజ్యాంగ రీత్యా రాష్ట్రపతి ప్రథమ పౌరుడు కావడంతో ఆయనే జెండా ఎగురవేయడం జరుగుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. దీంతో మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి పతాకావిష్కరణ చేస్తుంటారు. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వేరువేరు ప్రాంతాల్లో జరుపుతారనే విషయం చాలా మందికి తెలియదు.