https://oktelugu.com/

ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలు ఎన్నో తెలుసా..!

ఏపీలో పంచాయతీ పోరు హోరాహోరీగా నడుస్తోంది. ఒకవైపు ఏకగ్రీవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం చూస్తుంటే.. అటు ప్రతిపక్షాలు, ఎస్‌ఈసీ అందుకు అడ్డుపడుతున్నాయి. అయినా.. పలుచోట్ల ఏకగ్రీవాలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు, విత్‌డ్రా ముగియడంతో ఏకగ్రీవాల పంచాయతీ లెక్క కొలిక్కి వచ్చింది. Also Read: చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. టీడీపీ మేనిఫెస్టోకు చెక్ ఏపీ పంచాయ‌తీ పోరులో అనేక పంచాయ‌తీ ప్రెసిడెంట్ల ఎన్నిక దాదాపుగా ఏక‌గ్రీవంగా ముగిసింది. కేవ‌లం ఒకే నామినేష‌న్ దాఖ‌లు అయిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 5, 2021 / 11:38 AM IST
    Follow us on


    ఏపీలో పంచాయతీ పోరు హోరాహోరీగా నడుస్తోంది. ఒకవైపు ఏకగ్రీవాల సంఖ్య పెంచాలని ప్రభుత్వం చూస్తుంటే.. అటు ప్రతిపక్షాలు, ఎస్‌ఈసీ అందుకు అడ్డుపడుతున్నాయి. అయినా.. పలుచోట్ల ఏకగ్రీవాలు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మొదటి విడత నామినేషన్లు, విత్‌డ్రా ముగియడంతో ఏకగ్రీవాల పంచాయతీ లెక్క కొలిక్కి వచ్చింది.

    Also Read: చంద్రబాబుకు షాకిచ్చిన నిమ్మగడ్డ.. టీడీపీ మేనిఫెస్టోకు చెక్

    ఏపీ పంచాయ‌తీ పోరులో అనేక పంచాయ‌తీ ప్రెసిడెంట్ల ఎన్నిక దాదాపుగా ఏక‌గ్రీవంగా ముగిసింది. కేవ‌లం ఒకే నామినేష‌న్ దాఖ‌లు అయిన పంచాయతీల ఎన్నిక లాంఛ‌నంగా ముగిసిన‌ట్టే. నామినేష‌న్ల దాఖ‌లు, నామినేష‌న్ ల విత్ డ్రాల స‌మ‌యం ముగిసిన నేప‌థ్యంలో.. ప‌లు పంచాయ‌తీల్లో ఒకే నామినేష‌న్ దాఖ‌లు కావ‌డంతో వాటి ఎన్నిక లాంఛ‌నంగా ముగిసింది.

    రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నామినేష‌న్ దాఖ‌లైన పంచాయ‌తీల సంఖ్య సుమారు వంద కాగా.. విత్ డ్రా స‌మ‌యంలో భారీ సంఖ్యలో ఏక‌గ్రీవాలు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఒకే నామినేష‌న్ దాఖ‌లైన వాటికి తోడు.. పోలింగ్ అవ‌స‌రం లేకుండా ఏక‌గ్రీవాలు అయిన పంచాయ‌తీల సంఖ్య జిల్లాల వారీగా ఇలా ఉంది..

    Also Read: పార్లమెంట్ లో గళం.. ఏపీకి వైసీపీ ఎంపీలు ఏం సాధించారో తెలుసా?

    -చిత్తూరు జిల్లాలో- 454 పంచాయతీలకు గాను 96 ఏకగ్రీవం కాగా.. -గుంటూరు జిల్లాలో- 337 పంచాయతీలకు 67.. -కర్నూలు జిల్లాలో- 193 పంచాయతీలకు 54 .. -వైఎస్‌ఆర్‌ జిల్లా-లో 206 పంచాయతీలకు 46.. -పశ్చిమ గోదావరి జిల్లాలో 239 పంచాయతీలకు 40.. -శ్రీకాకుళం జిల్లా-లో 321 పంచాయతీలకు 34 .. -విశాఖ జిల్లాలో- 340 పంచాయతీలకు 32.. -తూర్పు గోదావరి జిల్లాలో 366 పంచాయతీలకు 28.. -కృష్ణా జిల్లాలో 234 పంచాయతీలకు 20.. -ప్రకాశం జిల్లాలో- 229 పంచాయతీలకు 16 .. -నెల్లూరు జిల్లాలో 163 పంచాయతీలకు 14.. -అనంతపురం జిల్లాలో 169 పంచాయతీలకు 6 ఏకగ్రీవం అయ్యాయి.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్