https://oktelugu.com/

నాన్న వైఎస్ఆర్ పై జగన్ కు ఎంత ప్రేమ ఉంది?

వైఎస్ జగన్ పార్టీ పేరే ‘వైఎస్ఆర్’ కాంగ్రెస్.. పార్టీ పేరులోనే నాన్నను ఇముడ్చుకున్నాడు ఏపీ సీఎం.. ఇక తన ప్రతీ పథకానికి ఆయన పేరే పెట్టుకుంటున్నాడు. మరి వైఎస్ఆర్ చనిపోయాడు.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆరాధ్యుడు కాబట్టి జగన్ ఆయనను ఓన్ చేసుకున్నారా? లేక నిజంగానే చిన్నప్పటి నుంచి ఈ ప్రేమ ఉందా? జగన్ కు నాన్న వైఎస్ఆర్ పై ప్రేమ ఎంత ఉంది? దీనిపై తాజాగా వైఎస్ఆర్ భార్య, జగన్ తల్లి అయిన విజయమ్మ హాట్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 16, 2020 / 02:10 PM IST
    Follow us on


    వైఎస్ జగన్ పార్టీ పేరే ‘వైఎస్ఆర్’ కాంగ్రెస్.. పార్టీ పేరులోనే నాన్నను ఇముడ్చుకున్నాడు ఏపీ సీఎం.. ఇక తన ప్రతీ పథకానికి ఆయన పేరే పెట్టుకుంటున్నాడు. మరి వైఎస్ఆర్ చనిపోయాడు.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఆరాధ్యుడు కాబట్టి జగన్ ఆయనను ఓన్ చేసుకున్నారా? లేక నిజంగానే చిన్నప్పటి నుంచి ఈ ప్రేమ ఉందా? జగన్ కు నాన్న వైఎస్ఆర్ పై ప్రేమ ఎంత ఉంది? దీనిపై తాజాగా వైఎస్ఆర్ భార్య, జగన్ తల్లి అయిన విజయమ్మ హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆమె రాసిన ‘నాలో నాతో వైఎస్ఆర్’ పుస్తకంలో జగన్ గురించి ఆమె కొన్ని సీక్రెట్స్ చెప్పారు. అవిప్పుడు వైరల్ గా మారాయి.

    వైఎస్ జగన్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్.. చాలా తక్కువ కాలంలోనే రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగాడు. ఇక తండ్రి మరణంతో జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాటి కాంగ్రెస్ ను సోనియా గాంధీని దిక్కరించి సొంతంగా పయనించారు. 10 ఏళ్లలో అష్టకష్టాలు పడ్డారు. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఎదురునిలిచారు. 16 నెలలు జైలుకు కూడా వెళ్లారు. 2014లో ఓడిపోయి 2019లో ఎట్టకేలకు గెలిచారు.

    రాజకీయాల్లోకి వచ్చాక కఠిన ఆహార నియమాలు రూపొందించుకున్నారు సీఎం జగన్.. వాస్తవానికి ఒకప్పుడు జగన్ కి చికెన్ అంటే చాలా ఇష్టం. అధికంగా చికెన్ తినేవారట.. చిన్నప్పటి నుండి వైయస్సార్ కొడుకు జగన్, కూతురు షర్మిలలు చికెన్ ఇష్టపడి తినేవారట.. అయితే జగన్ మాత్రం 1996 నుండి చికెన్ తినడం మానేశారు. దాదాపుగా పాతికేళ్లుగా జగన్ చికెన్ తినడం మానేశారు. దీనివెనుక బలమైన కారణం కూడా ఉంది.

    వైఎస్ఆర్ పై ప్రేమ.. జగన్ పై కోపం.. ఎందుకు?

    వైయస్సార్ అప్పుడు ఓటమెరుగని రాజకీయ నాయకుడిగా వెలుగొందుతున్నాడు. పులివెందుల ఎమ్మెల్యేగా.. కడప ఎంపీగా పోటీచేస్తూ గెలుస్తున్నారు. జీవితంలో ఏనాడు ఓటమి ఎరుగని ఒకే ఒక నాయకుడిగా సొంతమైన రికార్డును వైఎస్ఆర్ కలిగి ఉన్నారు. అలాంటి వైయస్సార్ కి 1996లో కడప పార్లమెంటు ఎన్నికల్లో టెన్షన్ మొదలైంది. 1996 లో కాంగ్రెస్ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కౌంటింగ్ రోజు నాటికి వైఎస్ఆర్ కుటుంబంలో ఏదో తెలియని టెన్షన్ మొదలైంది. గెలిస్తామనే ఆశలు సన్నగిల్లాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం చాలా టెన్షన్ పడ్డారట. ఆ టెన్షన్ చూసి జగన్, షర్మిల కూడా చాలా ఆందోళన చెందారు.

    దీంతో ఏనాడు ఉపవాసం తెలియని షర్మిల.. నాన్న వైఎస్ఆర్ విజయం సాధించాలని దేవుడికి ఆరోజంతా ఉపవాస దీక్ష పాటించారు. షర్మిల అలా చేస్తే.. జగన్ తన తండ్రి గెలవాలని దేవుడికి తనకిష్టమైనది త్యాగం చేస్తానని వేడుకున్నాడు. తండ్రి ఎన్నికల్లో గెలిస్తే తనకు అత్యంత ఇష్టమైన చికెన్ తినడం మానేస్తానని జగన్ ప్రార్థించాడు… జగన్, షర్మిల కోరికలు ఫలించాయి. వైయస్సార్ 1996 ఎన్నికల్లో కడప ఎంపీగా గెలుపొందారు.

    అంతే ఆ రోజు నుండి ఈరోజు వరకు వైఎస్ జగన్ చికెన్ తినడం మానేశారు. ఈ విషయాన్ని స్వయంగా జగన్ తల్లి వైయస్ విజయమ్మ ఇటీవల రాసిన ‘నాలో నాతో వైఎస్ఆర్’ పుస్తకంలో ప్రస్తావించారు.

    తండ్రి కోసం ఆ రోజు తీసుకున్న నిర్ణయాన్ని జగన్ ఈరోజు వరకు తండ్రి వైఎస్సార్ చనిపోయి పదేళ్లు అయినా వెనక్కి తీసుకోలేదు. ఇప్పటికీ జగన్ చికెన్ తినడం లేదు. తండ్రి అంటే ఎంతటి మమకారం ప్రేమ, గౌరవము అని చెప్పడానికి ఈ ఒక్క విషయం నిరూపిస్తోంది. అందుకే జగన్ అన్ని విషయాల్లోనూ తన తండ్రిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగిపోతున్నారు.. ఇలాంటి అత్యాధునిక రాజకీయాల్లో ఇంకా మాటకు కట్టుబడి ఉండడం.. మాట తప్పడు మడమ తిప్పడని పేరున్న జగన్ అదే మాటపై 25ఏళ్లుగా నిలబడడం విశేషమే మరీ..

    -నరేశ్ ఎన్నం