https://oktelugu.com/

Kodurupaka Village: సాయంత్రం లేని తెలంగాణలోని ఈ ఊరి గురించి తెలుసా..?

Kodurupaka Village:  సాధారణంగా ఇండియాలోని ప్రతీ గ్రామంలో ఉదయం, పగలు, రాత్రి సమయాలు గడుస్తుంటాయి. కొన్ని మారుమూల గ్రామాలలో ఇప్పటికీ కాల గడియారాలను కాకుండా సూర్యోదయం, సూర్యాస్తమయంలనే కాలంగా భావిస్తారు. కానీ ఆ గ్రామంలో సాయంత్రం అనేది కనిపించదట. ఉదయం, పగలును మాత్రమే ఇక్కడి గ్రామాలు చూస్తున్నారు. సాయంత్రం అనేది లేకుండానే చీకటి పడుతుంది. మిగతా గ్రామాల కంటే భిన్నంగా ఉన్న ఈ గ్రామంలో 365 రోజులు ఇదే పరిస్థితి. అయితే ఇలాంటి గ్రామం ఎక్కడో కాదు […]

Written By:
  • NARESH
  • , Updated On : December 22, 2021 / 09:41 AM IST
    Follow us on

    Kodurupaka Village:  సాధారణంగా ఇండియాలోని ప్రతీ గ్రామంలో ఉదయం, పగలు, రాత్రి సమయాలు గడుస్తుంటాయి. కొన్ని మారుమూల గ్రామాలలో ఇప్పటికీ కాల గడియారాలను కాకుండా సూర్యోదయం, సూర్యాస్తమయంలనే కాలంగా భావిస్తారు. కానీ ఆ గ్రామంలో సాయంత్రం అనేది కనిపించదట. ఉదయం, పగలును మాత్రమే ఇక్కడి గ్రామాలు చూస్తున్నారు. సాయంత్రం అనేది లేకుండానే చీకటి పడుతుంది. మిగతా గ్రామాల కంటే భిన్నంగా ఉన్న ఈ గ్రామంలో 365 రోజులు ఇదే పరిస్థితి. అయితే ఇలాంటి గ్రామం ఎక్కడో కాదు మన తెలంగాణలోనే ఉంది. ఆ ఊరు విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

    Kodurupaka Village

    పెద్దపల్లి జిల్లాలోని కొదురుపాక గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడి ప్రజలు 365 రోజులు సాయంత్రాన్ని చూడరు. మధ్యాహ్నం 3 గంటల తరువాత ఊరు మొత్తం నీడ పడుతుంది. దీంతో ఇక్కడి వారు పనులకు వెళ్లిన వారు తిరిగి తొందరగా తమ ఇళ్లకు చేరుకుంటారు. అయితే సాయంత్రం ఏర్పడకుండా ఊరిచుట్టూ నాలుగు దిక్కులా నాలుగు కొండలు ఉన్నాయి. పెద్ద పెద్ద కొండల మధ్య ఈ గ్రామం ఉంది. దీంతో సూర్యోదయం, పగలు మాత్రమే ఉంటాయి. సాయంత్రాన్ని చూడకముందే చీకటి ఏర్పడుతుంది. మరోవైపు వీరికి ఇతర గ్రామాల్లాగా సూర్యుడు ఉదయం 6 గంటలకు కాకుండా 9 గంటల తరువాత కనిపిస్తాడట.

    కొదురుపాక గ్రామానికి ‘మూడుజాముల కొదురుపాక’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ గ్రామానికి తూర్పున గొల్లగుట్ట, పడమర రంగనాయకుల గుట్ట, ఉత్తరాన నంబులాద్రి స్వామి గుట్టలు, దక్షిణాన పాముబండ గుట్టలు ఉన్నాయి. ఈ నాలుగు గుట్టల మధ్య గ్రామం ఏర్పడిందని స్థానికులు అంటున్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పోలిస్తే ఇక్కడ పగటి సమయం తక్కువగా ఉంటుంది. సాయంత్రం అనేది లేకుండానే చీకటి పడుతుంది. నేరుగా రాత్రి సమయంలోకి వెళ్తోందా..? అన్న ఫీలింగ్ కలుగుతుందని గ్రామస్థులు అంటున్నారు. దీంతో తమ గ్రామాన్ని మూడు జాముల కొదురుపాక గా మార్చుకున్నామని అంటున్నారు.

    మొదట్లో ఈ గ్రామాన్ని పొదలపాక అని పిలిచేవారట. ఆ తరువాత కొదురుపాకగా మార్చారు. ఇప్పుడు మూడు జాముల కొదురపాకగా పిలుస్తున్నారు.చుట్టూ గుట్టలే ఉండడం వల్ల ఇక్కడ పగటి సమయం ఎక్కువ సేపు ఉండడం లేదు. కాంతి సహా లక్షణాలైన పరావర్తనం, వక్రీభవనాలే కొదురుపాకలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పరిచాయని భౌతిక శాస్త్ర నిపుణులు అంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇక్కడి గ్రామస్థులు డి-విటమిన్ లోపం ఏర్పడుతుందని అంటున్నారు.

    Also Read:  ధాన్యం కొనుగోళ్లు: తప్పు తెలంగాణదే అన్నట్టు?

    ఇక్కడి గ్రామస్థుల్లో లక్షణాలు లేకపోయినా చాలా మందిలో డి-విటమిన్ లోపం ఉండే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందువల్ల ఇక్కడి వారు డి విటమిన్ అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఏర్పడినా ఇక్కడి వారు రోజూవారీ తమ పనులు చేసుకుంటూ మిగతావారిలాగే జీవిస్తున్నారు. కానీ సూర్యరశ్మి లోపం కొందరిలో ఉంటుందని అంటున్నారు. గ్రామస్థులు ఇతర పనుల నిమిత్తం వేరే గ్రామాలకు వెళ్లి తిరిగి రావాలనుకుంటే వారు ముందే పని నుంచి బయలు దేరేందుకు ఆరాటపడుతారు.

    ఈ గ్రామంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొందరు అంటున్నారు. సూర్యరశ్మి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే చాలా మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. అలాంటిది సూర్యుడు వీరికి తక్కువగా ప్రసరించడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. కానీ గ్రామస్థులు మాత్రం తమకు ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు రాలేదని అంటున్నారు. ఆరోగ్య విషయంలో డి విటమిన్ తో బాధపడేవారు ఇప్పటి వరకు గ్రామంలో గుర్తించలేదని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉన్నారు. వారిలో సమస్య ఉండదు. కానీ చిన్నపిల్లల్లో ఈ సమస్య రావచ్చని అంటున్నారు.

    Also Read:  బాప్ రే.. తెలంగాణ రాష్ట్రంపై ఇన్ని అప్పులా? తెలిస్తే షాక్ అవుతారు