సొంత గూటికే డీకే అరుణ?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెసులో డీకే అరుణ చక్రం తిప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా చేసి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన మరణం.. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో డీకే అరుణకు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలకు విసుగుచెంది ఆమె కిందటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలోకి వెళ్లారు. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ ఆమె […]

Written By: Neelambaram, Updated On : August 28, 2020 7:29 pm
Follow us on


దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెసులో డీకే అరుణ చక్రం తిప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా చేసి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆయన మరణం.. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడంతో డీకే అరుణకు కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలకు విసుగుచెంది ఆమె కిందటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలోకి వెళ్లారు. మహబూబ్ నగర్ ఎంపీగా పోటీచేసి ఓటమి చెందారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నప్పటికీ ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గెలుపు కష్టమేనా?

మహబూబ్ నగర్ జిల్లా రాజకీయానికొస్తే డీకే అరుణ పేరు విన్పిస్తుంటుంది. మహబూబ్ నగర్ జిల్లాలో 2004లో ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర డీకే అరుణకు ఉంది. కాంగ్రెసులో ఉన్నప్పుడు మహిళా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కంచుకంఠంతో సమస్యలపై తన గళాన్ని బలం విన్పించడంతో డీకే అరుణ ముందుంటారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రి చేసిన అనుభవం డీకే అరుణకు ఉంది. జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి డీకే అరుణ గట్టి పోటీ ఇచ్చారు. టీఆర్ఎస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ గ్రూపు తగదాలతో కొంతకాలం డీకే అరుణ ఇబ్బందులు పడ్డారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన ఓటమి పాలయ్యాక సైలంటయ్యారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీ హవా వీస్తుందని ఆ పార్టీలోకి చేరారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి గట్టి పోటీ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నా ఆమెకు సరైన గుర్తింపు లభించడం లేదు. కాంగ్రెస్ లో చక్రం తిప్పినట్లు బీజేపీలో రాజకీయాలు చేయలేకపోతున్నారు. అంతేకాకుండా ఆమెకు బీజేపీ అధిష్టానం మద్దతు పెద్దగా లభించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిస్తోంది.

Also Read: జై కేటీఆర్‌‌.. ఆయనే మా సీఎం

ప్రస్తుతం కాంగ్రెసులో సత్తాచాటుతున్న రేవంత్ రెడ్డి ద్వారానే కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట. ఒకే జిల్లాకు చెందిన వీరిద్దరి మధ్య ఒకప్పుడు రాజకీయంగా బేధాభిప్రాయాలు నెలకొన్నాయి. రాజకీయం శత్రువులుగా మారినా వీరిద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో ప్రస్తుతం టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారివారి అవసరాల రీత్య కలిసి పనిచేసేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెసులోకి రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తన ప్రాభవాన్ని చాటాలని డీకే అరుణ భావిస్తున్నారట. కొద్దిరోజులుగా డీకే అరుణ సొంతగూటికి వెళుతారనే ప్రచారం జిల్లాల్లో జోరుగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.