AP Districts Bifurcation: అధికారంలో ఉన్న ప్రభుత్వం ఒక పని చేస్తున్నామంటే.. దాని వల్ల ప్రజలకు ఏ మేరకు న్యాయం జరుగుతుందనే విషజ్ఞంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అంతే గానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందా లేదా అన్న దాన్ని ప్రథమంగా తీసుకోవద్దు. కానీ జగన్ చేస్తున్న ఈ పనిని సరిగ్గా వేలెత్తి చూపించారు జనసేన అధినేత పవన్ కల్యాన్. మొదటి నుంచి ఆయన విధానాలు చాలా విభిన్నంగా ఉంటాయి.

ఆయన ఏ పని చేసినా అందులో జనాలకు ఏమైనా ఇబ్బంది ఉందా అనే కోణంలోనే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఇప్పుడు మరోసారి తన దైన స్టైల్‌ను కనబర్చారు. ఈరోజు సీఎం జగన్ కొత్త జిల్లాలలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా కొత్త జిల్లాల ప్రాతిపదికపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ కొత్త జిల్లాలు ప్రజల ఆకాంక్ష మేరకు జరగలేదని తేల్చారు.
డిమాండ్ ఉన్న ప్రాంతాలను పక్కకు వదిలేసి ఇతర ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా మార్చారంటూ విమర్శించారు. చాలా ప్రాంతాల అవసరాలపై కూడా ఎలాంటి అధ్యయనం చేయకుండానే ఇష్టారీతిన విభజించేశారంటూ మండిపడ్డారు. ఉదాహరణకు చూసుకుంటే.. పాడేరు కేంద్రంగా ఏర్పడ్డ జిల్లాలో ముంపు మండలాలు ఉన్నాయని, ఈ మండలాల్లో ఉన్న గిరిజన వాసులకు అన్యాయం జరిగిందంటూ చెప్పుకొచ్చారు.

మరి ప్రజల కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న జగన్.. ప్రజలను ఇబ్బంది పెట్టి ఎలాంటి పాలన అందిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో పవన్ మాట్లాడిన చాలా విషయాలు ఆలోచించదగ్గవే. ఎందుకంటే ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే.. అట్టడుగు వారికి కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయం ఉండాలన్నది ముఖ్యం.
కానీ ఇప్పుడు జగన్ చేసింది మాత్రం ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా సులువుగా తాము అనుకున్నది చేశారు. కానీ ప్రజల అవసరాల రీత్యా.. మరోసారి జిల్లాల పునర్విభన బాధ్యతను జనసేన అధికారంలోకి వచ్చాక తాము తీసుకుంటామని వివరించారు పవన్. మరి ఈ కొత్త జిల్లాలపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏమైనా కార్యక్రమాలను జనసేన చేపడుతుందో లేదో చూడాలి.