Congress: కాంగ్రెస్ కథ: బలోపేతం మాటున బలహీనపర్చే ప్రయత్నం..

Congress: మిగతా పార్టీలతో పోల్చుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీలో వాక్‌ స్వాతంత్రం బాగా ఎక్కువ. ఎక్కడైనా.. ఎవరైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతపక్షంలో ఉన్నా అధికార పక్ష నాయకులు, మంత్రులను కలుస్తూ కాంగ్రెస్ నేతలు తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీలో వర్గపోరు పెరుగుతోంది. -రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గం.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తర్వాత రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీ పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచీ కాంగ్రెస్‌లో వర్గపోరు ఎక్కువైంది. పార్టీకి ఇది కొత్త కాకపోయినా రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత ఇది […]

Written By: NARESH, Updated On : March 21, 2022 6:37 pm
Follow us on

Congress: మిగతా పార్టీలతో పోల్చుకుంటే.. కాంగ్రెస్‌ పార్టీలో వాక్‌ స్వాతంత్రం బాగా ఎక్కువ. ఎక్కడైనా.. ఎవరైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రతపక్షంలో ఉన్నా అధికార పక్ష నాయకులు, మంత్రులను కలుస్తూ కాంగ్రెస్ నేతలు తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్టీలో వర్గపోరు పెరుగుతోంది.

-రేవంత్‌రెడ్డి వ్యతిరేకవర్గం..
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తర్వాత రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధిష్టానం టీపీసీసీ పగ్గాలు అప్పగించింది. అప్పటి నుంచీ కాంగ్రెస్‌లో వర్గపోరు ఎక్కువైంది. పార్టీకి ఇది కొత్త కాకపోయినా రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వి.హనుమంతరావు, జగ్గారెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి వంటి సీనియర్‌ నాయకులు రేవంత్‌ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. బయటకు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నప్పటికీ రెవంత్‌రెడ్డి సారథ్యంంలో పనిచేయడం ఇష్టంలేని నాయకులు వ్యతిరేక టీపీసీసీకి సమాంతరంగా పార్టీని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని గుర్తించిన రేవంత్‌రెడ్డి వర్గం సోషల్‌ మీడియా వేదికగా రేవంత్‌ వ్యతిరేక వర్గీయులపై దృష్ప్రచారం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా నెల క్రితం ఎమ్మెల్యే జగ్గారెడ్డిని టార్గెట్‌ చేసి అతడు టీఆర్‌ఎస్‌ నాయకులతో టచ్‌లో ఉంటున్నారని, స్వలాభం కోసం పార్టీని వీడుతున్నారని ప్రచారం చేశారు. దీంతో మనస్తాపం చెందిన జగ్గారెడ్డి ఒకానొక దశలో పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే వీహెచ్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సర్దిచెప్పడంతో కాస్త వెనక్కి తగ్గారు.

Also Read: Telangana Congress Party: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న హ‌రీశ్‌రావు.. వీహెచ్‌కు పైస‌లిచ్చిండ‌ట‌..!

-తాజాగా రహస్య మీటింగ్‌లు..
తాజాగా రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గీయులు మంత్రి హరీశ్‌రావుతో టచ్‌లో ఉంటున్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు. ఇటీవల వీహెచ్‌ కూడా హరీశ్‌రావును కలిశారు. ఈ విషయ తెలియడంతో వీహెచ్‌పై చర్యకు టీపీసీసీ సిద్ధమవుతోంది. దీనిని గమనించిన వీహెచ్‌ రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గం నాయకులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంతో టీపీసీసీ మరింత ఆగ్రహంతో ఉంది. ఒకే పార్టీలో ఉంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్‌లు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

-బలోపేతం కోసం అంటూ..
దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాభవం చవి చూసింది. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో రాకూడదని, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యఃగా పనిచేస్తున్నామంటూ రేవంత్‌ వ్యతిరేక వర్గం రహస్య సమావేశాలకు భాష్యం చెబుతోంది. పార్టీ భవిష్యత్‌ కార్యారచణ రూపొందిస్తున్నామని పేర్కొంటున్నారు. తాము నిర్వహించేది అసమ్మతి సమావేశాలు కాదంటూనే టీపీసీసీకి తెలియకుండా వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. తాజాగా ఆదివారం హైదరాబాద్‌లో వీహెచ్‌ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించింది. ఇది కూడా పార్టీ బలోపేతానికే అంటూ ఈ సమావేశానికి హాజరైన నాయకులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం ఏం చేయాలో తోచక తల పట్టుకుంటోంది.

-బలహీనమే తప్ప.. బలోపేతం కాదు..
రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం ఈ సమావేశాలతో పారీకి మరింత అపవాదు తప్ప బలోపేతం ఏమీ ఉండదంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే దాదాపు దశాబ్దకాలంగా అధికారినికి దూరంగా ఉన్న కాం్రVð స్‌ పార్టీ క్రమంగా బలహీన పడుతూ వస్తోంది. 2018 ఎన్నికల సమయంలో కాస్త హడావుడి కనిపించినా తర్వాత పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో పార్టీ అధమస్థాయిగి దిగజారింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం అనేక సమాలోచనల తర్వాత రేవంత్‌రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పగించింది. వాస్తవంగా చెప్పాలంటే అవసాన దశలో ఉన్న పార్టీకి ఆయన వచ్చాకే క్యాడర్‌లో కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. సీఎం కేసీఆర్‌తో రేవంత్‌రెడ్డి ఢీ అంటే ఢీ అనడంతో పార్టీ కేడర్‌కు కాస్త ధైర్యం వచ్చింది. ఇది నచ్చని రేవంత్‌ వ్యతిరేక వర్గం రహస్య సమావేశాలతో పార్టీని మళ్లీ బలహీన పర్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read: Y S Jagan Finalising New Cabinet Ministers: జిల్లాల వారీగా కొత్త మంత్రుల లిస్టు రెడీ.. జ‌గ‌న్ అనుగ్ర‌హం ఎవ‌రికో..!