Disha Encounter: దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్ ఒక బూటకమి, కావాలనే నిందితులను పోలీసులు పాయిట్ బ్లాక్‌లో కాల్చి చంపారని సుప్రీంకోర్టు నియమించిన సిర్పూర్కర్ కమిటీ నివేదిక ఇచ్చింది. 387 పేజీల నివేదికను బాధిత కుటుంబాలకు పిటిషనర్లకు అందించాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నివేదిక సమర్పించిన చాలా రోజుల తర్వాత సుప్రీం దీనిపై స్పందించింది. ఇదే సమయంలో కేసులు తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. నివేదికపై ఎవరికైనా అభ్యంతరాలను హైకోర్టుకు చెప్పాలని సూచించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కాపీలను ఇరు వర్గాలకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మూడేళ్ల క్రితం…
తెలంగాణలో మూడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటన బూటకమని.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన సిర్పూర్కర్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు 387 పేజీలతో సుప్రీంకోర్టుకు కమిషన్ రిపోర్ట్ సమర్పించింది. పోలీసులు కావాలనే నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేశారని సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో పేర్కొంది. పోలీస్ మ్యానువల్‌కు భిన్నంగా విచారణ చేపట్టినట్టు తెలిపిన కమిషన్.. నిందితుల్లో ముగ్గురు మైనర్లన్న విషయం పోలీసులు దాచారని నివేదికలో వెల్లడించింది. పోలీసులు గాయపడి ఆస్పత్రిలో చేరడం కట్టుకథ అని ఆరోపించింది. ఇక దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీంకోర్టు.. అభ్యంతరాలను హైకోర్టుకు చెప్పాలని సూచించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదిక కాపీలను ఇరు వర్గాలకు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: Pawan Kalyan :తెలంగాణ రాజకీయాల్లోకి పవన్ ఎంట్రీ ప్రకటన.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
సజ్జనార్‌కు శిక్ష?
ప్రస్తుత ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌కు నేతృత్వం వహించారు. సిర్పూర్కర్ కమిటి నివేదిక ఈ ఎన్‌కౌంటర్ బూటకమని తేల్చిన నేపథ్యంలో నాడు సీపీగా ఉన్న సజ్జనార్‌కు శిక్ష పడే అవకాశం ఉంది. దాదాపు ఆరు నెలలపాటు సాగిన కమిటీ విచారణలో సజ్జనార్ కూడా పలుమార్లు కమిటీ ముందు హాజరయ్యారు. ఆయనతోపాటు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను, గాయపడినట్లు ఆస్పత్రిలో చేరిన పోలీస్ కానిస్టేబుల్‌తోపాటు వైద్యం చేసిన డాక్టర్లను కమిటీ విచారణ చేసింది. అన్ని వివరాలు సేకరించిన తర్వాతనే సుప్రీం కోర్టుకు నివేదిక అందించింది. ఈ ఎన్‌కౌంటర్ ఫేక్ అని, నిందితులను పట్టుకొచ్చి పాయింట్ బ్లాక్‌లో కాల్చరని కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ నివేదికపై హైకోర్టులో విచారణ జరుగనుంది. అయితే ఉద్యోగానికి, హోదాకు వన్నె తెచ్చే అధికారిగా గుర్తింపు ఉన్న సజ్జనార్‌కు ఇది మాయని మచ్చ. విచరణలో నేరం రుజువు అయితే సజ్జనార్ జైలుకు వెళ్లక తప్పదు.
బాధిత కుటుంబాలకు పరిహారం..
ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నలుగురు నిందితుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఈమేరకు బాధిత కుటుంబాలు కోర్టును కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్‌కౌంటర్ తర్వాత నిందితుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత సంఘటన గురించి మాట్లాడేందుకు కూడా నిందితుల కుటుంబ సభ్యులు ఇష్టపడడం లేదు. కానీ ఎన్‌కౌంటర్ మాత్రం బూటకమని మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలో తమ పరిస్థితిని కోర్టు దృష్టికి తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని వేడుకునే అవకాశం ఉంది. ఒక్కో నిందితుడికి రూ.కోటి వరకు పరిహారం అడిగే అవకాశం ఉన్నట్లు నిందితుల తరఫు న్యాయవాది తెలిపారు.
Also Read: YCP- Bendapudi Students: ఆ విద్యార్థుల ప్రతిభను వైసీపీ భలే క్యాష్ చేసుకుంటోంది