TDP Kesineni Nani : ఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా రాకముందే ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అటు టిడిపి, ఇటు వైసిపి నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. పరస్పరంగా దాడులు చేసుకునేందుకు కూడా వెనుకాడడం లేదు. అయితే విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఒక భిన్నమైన పరిస్థితి పరిస్థితి నెలకొంది. ఇక్కడ టిడిపి నాయకులే పరస్పరంగా విమర్శలు చేసుకోవడం విశేషం. కాల్ మనీ, వ్య****, సె** రాకెట్ వంటి వ్యవహారాలు తెరపైకి రావడం విశేషం.
ప్రస్తుతం కేశినేని నాని తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంపై గట్టిగా ఫోకస్ పెట్టారు. తను సూచించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం వద్ద గట్టిగా పోరాడుతున్నారు. అంతేకాదు బుధవారం కేశినేని చిన్ని వర్గీయులతో వాగ్వాదం కూడా జరిగింది. ఈ ఘటనలో ఒక పోలీస్ కూడా గాయపడ్డాడు. ఇదంతా జరుగుతుండగానే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కేశినేని నాని కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెబుతున్న ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. బీసీలు అంటే గౌరవానికి ప్రతీక. అలాంటి బీసీ కులంలో పుట్టి సె**, కాల్ మనీ, వ్య****వంటి విషయాలలో తల దూర్చి, భూకబ్జాలు చేసిన వారికి టికెట్ ఎలా ఇస్తారని నానీ ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో అలాంటి వారికి విజయవాడ తూర్పు అసెంబ్లీ స్థానం టికెట్ కేటాయిస్తే కచ్చితంగా వారిని ఓడిస్తామని నాని అంటున్న మాటలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాశంగా మారాయి. అంతేకాదు పార్టీ అధికారంలోకి రావాలంటే కొంతమంది నాయకులకు టికెట్లు ఇవ్వకపోవడమే మంచిదనే విషయాన్ని నాని ఆ వీడియోలో పేర్కొన్నట్టు తెలుస్తున్నది.
కేశినేని నాని ఇప్పుడు మాత్రమే కాదు 2019లో విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినప్పటి నుంచి పార్టీలో విధానాలపై ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు. కొంతకాలం పాటు ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. అప్పట్లోనే ఆయన వైసిపి తీర్థం పుచ్చుకోబోతున్నారు అని ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత అది గారికి పోయే పేలపిండి లాంటి వార్త అని తేలిపోయింది. ఆ మధ్య చంద్రబాబు నాయుడుతో కూడా నాని అంతగా మాట్లాడలేదు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ నాని చంద్రబాబు నాయుడుతో సఖ్యతగా ఉండటం ప్రారంభించారు. అయితే తిరువూరు సీటు విషయంలో మాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా నాని పలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజాదరణ ఉన్న వాళ్లకే టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని బలంగా కోరుతున్నారు. అంతేకాదు తాను ఫోకస్ చేసిన అసెంబ్లీ స్థానాల్లో.. తను సూచించిన వారికే టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే నాని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన పార్లమెంటు స్థానానికి కాకుండా విజయవాడ తూర్పు నుంచి పోటీలో ఉంటారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఉన్నట్టుండి విజయవాడ తూర్పు అభ్యర్థిపై అలాంటి కామెంట్లు చేయడం ప్రస్తుతానికి అయితే చర్చనీయాశంగా మారింది. అయితే ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధి.. నాని చేసిన వ్యాఖ్యలపట్ల ఎటువంటి కామెంట్స్ చేయలేదు. అయితే నాని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో దీని పర్యావసనాలు ఏ విధంగా ఉంటాయి అనేది అంత పెట్టకుండా ఉందని టిడిపి నాయకులు అంటున్నారు.. అయితే నాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
https://www.facebook.com/reel/273829842347390